Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

దేవీ
బుధవారం, 25 జూన్ 2025 (15:56 IST)
Manchu Vishnu, Prabhas, Akshay Kumar
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప రూపొందింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లు, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇందులో శివబాలాజీ చిత్రం గురించి రివ్యూ చెప్పేశారు.
 
‘కన్నప్ప’ కోసం ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. నేను మోహన్ బాబు నటించిన మాధవ శర్మ కొడుకుగా నటించాను. అసలు నాకు ఈ సినిమాలో అవకాశం రావడం కూడా అద్రుష్టంగా భావించా. మొదట పాత్ర చెప్పగానే ఇది అవసరమా? అనిపించింది. కానీ సినిమా చూశాక మిస్ అయితే నష్టపోయేవాడిని అనిపించింది. ఏది ఏమైనా విష్ణు వల్లే నాకు అవకాశం వచ్చింది.
 
ఇక ఇందులో ప్రభాస్ పాత్ర దాదాపు 40 నిముషాలు వుంటుంది. ఆ పాత్ర సినిమా ప్రత్యేక ఆకర్షణ. అసలు శివుడిగా మొదట అనుకుంది ప్రభాస్ నే. కానీ ఆయన వేరే సినిమాలు చేయడంవల్ల గెటప్ సమస్య వస్తుందని తప్పుకున్నట్లు తెలిసింది. అప్పుడు అక్షయ్ కుమార్ ను అనుకోవడం, ఆయన ఓకే చేయడం జరిగింది. అక్షయ్ ను శివుడిగా చూడగానే అసలు శివుడు ఇలా వుంటాడేమో అనిపించేలా ఆహార్యం పోయింది. కాజల్ పాత్ర 15 నిముషాలపాటు వుంటుంది.
 
ఈ సినిమా అప్పటి కాలానీకి సంబంధించిన లొకేషన్లు ఇలానే వుంటాయనేలా  సినిమాను దర్శకుడు తీర్చిదిద్దారు. సెకండాఫ్ లో 20 నిముషాలపాటు ప్రేక్షకులను మైమరిపిస్తుంది. అదే సినిమాకు హైలైట్. దానితో ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందనే అర్థమయింది. సినిమా మొత్తం జర్నీలో నేను వున్నాను. ప్రతీదీ తెలుసుకున్నాను. ఇందులో డైలాగ్స్, మాడ్యులేషన్స్, కథ, కథనం ఆకట్టుకుంటుంది. మొదటి ఆడియన్ గా నేను చెబుతున్న సూపర్ రివ్యూ ఇది అంటూ చిట్ చాట్ లో తెలిపారు.
 
మోహన్‌లాల్, బ్రహ్మానందం గారు ఇలా అందరితో పని చేయడం మరిచిపోలేని అనుభూతి. మోహన్ బాబు గారు ఈ వయసులోనూ ఎంతో ప్యాషనేట్‌గా పని చేశారు. నిర్మాతగా ఒకలా ఉండేవారు.. నటించేటప్పుడు ఇంకోలా అనిపించేవారు అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments