Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

దేవీ
బుధవారం, 25 జూన్ 2025 (15:33 IST)
Virgin Boys poster
టీనేజ్ యువతతో తీసిన సినిమా వర్జిన్ బాయ్స్. వర్జిన్ బాయ్స్ హాస్యం, శృంగారం మరియు భావోద్వేగాలతో వుంటుందని చిత్ర యూనిట్ ప్రచారం చేసింది. యువతకు సంబంధించిన కథాంశంతో. గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజా దారపునేని నిర్మించారు మరియు దయానంద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్ నేడు హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్ లో విడుదలైంది. 
 
ఈ ట్రైలర్ కోసం ప్రత్యేకంగా రెండు బస్సులతో టీనేజ్ ర్స్ ను తీసుకువచ్చారు. ట్రైలర్ ఆద్యంతం ద్వందార్థాలు, లిప్ కిస్ లు, ఆడ మగ తేడాలేకుండా మందు, సిగరెట్ తాగడం వంటి సన్నివేశాలే కనిపిస్తాయి. వాటిని రిపీట్ అంటూ మరోసారి వచ్చిన టీనేజర్ల కోరిక మేరకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా యాంకర్ కూడా శ్రుతి తప్పి ఎలావుంది ట్రైలర్. అనగానే అందరూ సైలెంట్ అయ్యారు. అంటే ఇది  చూశాక చల్లబడిపోయారా? అంటూ వెకిలినవ్వులు నవ్వింది. ఆ వెంటనే. నేను ఫ్లోలో బూతులు మాట్లాడతాను. తప్పయితే క్షమించడంటూ మాట్లాడడం కొసమెరుపు.
 
ఇంటర్ చదివే టీనేజర్లను ఇలాంటి సినిమా వేడుకకు తీసుకువచ్చి వారిచేత క్లాప్స్ కొట్టించడం మరీ విడ్డూరంగా వుంది. ఇందులో ముగ్గురు యువకులు..బికీనీ డ్రెస్ లో వున్న అమ్మాయిలను చూసి సూర్య కిరణం భూమిమీద పడేలోపు మా వర్జినిటీ పోగొట్టుకుంటామంటూ శపథం చేస్తారు.. సినిమాలోని పాయింట్ కూడా ఇదే. దానిపైనే కథను దర్శకుడు చూపించాడు. మరి బూతులు చెప్పి, చివరిలో సందేశం అనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సెన్సార్ బోర్డును అక్కడివారు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

ముంబై కుండపోత వర్షాలు - 250 విమాన సర్వీసులు రద్దు

Mumbai rains: రూ. 20 కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్స్ వద్ద వరద నీరు (video)

పాత బస్తీలో విషాదం : గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా ముగ్గురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments