Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ల‌య‌న్ కింగ్‌'కి డ‌బ్బింగ్ చెప్పిన సూప‌ర్ స్టార్, ఆయన తనయుడు...

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (21:19 IST)
క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడే తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూ వుంటుంది. ఇది అంతా డిస్ని వాళ్లు తయారుచేసిన లయన్ కింగ్ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ, సింబనే లయన్ కింగ్ కథకి హీరో, అలానే సింబతో పాటు టిమోన్ అనే ముంగిస పుంబా అనే అడివి పంది లయన్ కింగ్ కథలో ముఖ్య పాత్రలు.
 
కార్టూన్ నెట్వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన లయన్ కింగ్‌ని ఆ తరువాత డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమాగా 90లో విడుదల చేసారు. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీతో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లయన్ కింగ్ ఫాన్స్‌కి, కామిక్ అభిమానులకి సరికొత్త అనుభూతుని ఇచ్చేందుకు మరోమారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందలో భాగంగానే లయన్ కింగ్ కొత్త హంగులతో 3డి ఆనిమేటెడ్ సినిమాగా జులై 19న విడుదల అవుతుంది.
 
ఇప్పుడు ఈ విజువ‌ల్ వండ‌ర్‌కి షారుఖ్ ఖాన్ గాత్ర దానం చేశాడు. ల‌య‌న్ కింగ్‌లో కీల‌క పాత్రైన ముసాఫాకు షారుక్ డ‌బ్బింగ్ చెప్పారు, ఇక ముసాఫా త‌న‌యుడు సినిమాకు హీరో పాత్రైన సింబాకు షారుక్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
 
ఇప్పటికే, మార్వేల్ – డిస్నీ సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్లాక్బస్టర్‌గా నిలిచింది. ఆ వెంటనే అల్లాద్దీన్ రూపంలో మరోమారు డిస్నీ వారు వరల్డ్ మూవీ లవర్స్‌ని అలరించారు. ఇప్పుడు లయన్ కింగ్ రూపంలో మరో హిట్ తమ అకౌంట్‌లో పడనుంది అని డిస్నీ ఇండియా బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో కూడా లయన్ కింగ్ భారీ స్థాయిలో విడుదలకి రెడీ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments