Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రంగస్థలం'' నటనకు చెర్రీకి జాతీయ అవార్డు వచ్చినా.... అని చిరుతో చెప్పా...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం రంగస్థలం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన అద్భుతంగా వున్నదని సీనియర్ నటుడు నరేష్ ప్రశంసించారు. ఈ చిత్రంలో చెర్రీ నటన చ

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (21:10 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం రంగస్థలం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన అద్భుతంగా వున్నదని సీనియర్ నటుడు నరేష్ ప్రశంసించారు. ఈ చిత్రంలో చెర్రీ నటన చూసి అతడికి జాతీయ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని చరణ్ నాన్న చిరంజీవి గారితో చెప్పినట్లు నరేష్ వెల్లడించారు. రంగస్థలం చిత్రం విడుదల సందర్భంగా మీడియాతో రంగస్థలం చిత్ర బృందం మాట్లాడింది. 
 
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... ఈ చిత్రం 700కి పైగా థియేటర్లలో విడుదలవుతోంది. సెన్సార్ రిపోర్ట్ ఎక్స్‌లెంట్ అని చెప్పారు. చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ గారికి ధన్యవాదాలు. ఇక రామ్ చరణ్ గారి పెర్మారెన్స్ పీక్స్‌లో వుంటుంది. చిత్రాన్ని చూసేందుకు మరి కొన్నిగంటలే సమయం వుంది. ఆంధ్రలో 5 గంటల నుంచే ఈ చిత్రం ప్రదర్శమవుతుంది. తెలంగాణలో ఉదయం 8.30 గంటలకు ప్రదర్శిస్తారు అని చెప్పారు.
 
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మీ సహకారం ఈ చిత్రానికి చాలా బాగా వుంది. ఐతే చిత్రం విడుదలకు ముందే వుండే టెన్షన్ వుంది. చిత్రంలో నటించిన ప్రతి ఒక్క నటుడు, నటికి ధన్యవాదాలు. అత్త పాత్ర కోసం చాలా కష్టపడ్డాం. అనసూయ అత్త క్యారెక్టర్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. ఐతే చివరికి అనసూయ ఆ పాత్రలో ఒదిగిపోయి నటించిన విధానం చూసి తృప్తిపడ్డాం. ఈ చిత్రాన్ని తెల్లకాగితంలా వెళ్లి చూడండి అని చెప్పారు.
 
యాంకర్, నటి అనసూయ మాట్లాడుతూ... చాలా రోజులైంది మాట్లాడి. రంగస్థలానికి రంగం సిద్ధమైంది. రామ్ చరణ్‌తో అత్తా అని పిలుపించుకోవడంలో టెన్షన్ వున్నా సెట్లోకి వెళ్లాక ఆ టెన్షన్ అంతా పోయింది. ఏడాది పాటు అక్కడే గడిపేశాం. టెలివిజన్‌లో కోతి పనులు చేస్తూ వుంటాను కానీ ఇక్కడ అలాకాదు. రంగస్థలం నభూతో నభవిష్యతి. ఎన్నిసార్లు చూసినా ఈ చిత్రాన్ని చూస్తూనే వుంటారు అని చెప్పారు. 
 
సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ... టాలీవుడ్ మరో స్వర్ణయుగం చూస్తుంది. సూపర్ హిట్ అనేది నార్మల్ అవుతుంది. రెండుమూడేళ్లకోసారి ఓ చిత్రం వస్తుంటుంది. పదేళ్లపాటు గుర్తుంటుంది. రంగస్థలం కూడా అలాంటి చిత్రమే అవుతుంది. సుకుమార్ స్క్రిప్టుల్లో ఈ చిత్రం అత్యద్భుతమైనది. మనసును లాక్కెళ్లిపోతుంది. రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. మీ అబ్బాయికి జాతీయ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోవద్దండీ అని చిరంజీవి గారితో చెప్పాను. గోదావరిని తీసుకువచ్చి హైదరాబాదులో పెట్టారు. మైత్రీ మూవీస్ సినీ కెరీర్లో ఇది ఓ మైలురాయిగా నిలిచిపోతుంది అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments