Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ విషయంలో మరోసారి కన్నీరుపెట్టుకున్న రేణు దేశాయ్..

పవన్ కళ్యాణ్‌.. రేణుదేశాయ్‌ల స్టోరి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ప్రేమించి పెళ్ళి చేసుకుని చివరకు ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌ పెళ్ళి చేసుకున్నా రేణు మాత్రం వివాహం చేసుకోలేదు. కానీ రేణుదేశాయ్ మాత్రం సమాజంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోంట

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (18:59 IST)
పవన్ కళ్యాణ్‌.. రేణుదేశాయ్‌ల స్టోరి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ప్రేమించి పెళ్ళి చేసుకుని చివరకు ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌ పెళ్ళి చేసుకున్నా రేణు మాత్రం వివాహం చేసుకోలేదు. కానీ రేణుదేశాయ్ మాత్రం సమాజంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోంటోంది. భర్త లేని భార్యగా సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పెద్దగా చెప్పనవసరం లేదు. అందులోను ఒక ప్రముఖ నటుడు భార్యగా ఉండి ఆ తరువాత విడిపోవడమన్నది ఎలాంటి చర్చ జరుగుతుందో అస్సలు చెప్పనక్కర్లేదు. 
 
ఇప్పటివరకు రేణుకా దేశాయ్ ఎన్నో ఇబ్బందులు పడింది. తాజాగా మరోసారి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌ కారణంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి 23వ తేదీన తన కుమార్తె పుట్టినరోజు. విడిపోయినా సరే పవన్ కళ్యాణ్‌ కుమార్తె పుట్టిన రోజుకు ఖచ్చితంగా వెళ్ళేవారు. కానీ ఈసారి పుట్టినరోజు వేడుకలకు హాజరు కాలేదు. కానీ ఆ తరువాత జరిగిన నితిన్ చల్ మోహన్ రంగ సినిమా ఆడియో ఫంక్షన్‌కు మాత్రం హాజరయ్యారు పవన్. 
 
అలాగే రామ్ చరణ్‌ పుట్టినరోజు వేడుకల్లో కూడా హాజరై స్వయంగా కేక్ కట్ చేసి మెగా ఫ్యామిలీతో కలిసి భోజనం చేశారు. సొంత కుమార్తెతో గడిపేందుకు పవన్ కళ్యాణ్‌కు సమయం లేదు కానీ మిగిలిన వాటికి మాత్రం కావాల్సిన సమయం ఉందా అంటూ రేణుక దేశాయ్ బోరున విలపించిందట. అంతేకాదు తన బాధను సన్నిహితులతో కూడా చెప్పుకుందట. కొంతమంది రేణు దేశాయ్ స్నేహితులు ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్‌ పైన తీవ్రస్థాయిలో మండిపడుతూ మెసేజ్‌లు చేస్తున్నారట.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments