7 భాషల్లో విడుదల కానున్న ‘రెడ్’

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (16:47 IST)
బ్లాక్ బస్టర్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ చిత్రం ఈ నెల 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ ఇందులో కథానాయికలు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంఫై ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
చిత్ర సమర్పకులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ “రామ్ ద్విపాత్రాభినయం చేసిన తొలిచిత్రం ఇది. ఇటీవల విడుదల చేసిన టీజర్, థియేట్రికల్ ట్రైలర్, పాటలకు అధ్భుతమైన స్పందన లభిస్తోంది” అని చెప్పారు.
 
నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ మాట్లాడుతూ, “ఈ చిత్రాన్ని ఏడు భాషల్లోఅనువదించాం. కన్నడం, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ, తమిళంతో పాటు హిందీ లోకి కూడా డబ్ చేశాం. కన్నడ వెర్షన్ ఈ నెల 14నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్లను ఈ నెలాఖరున రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నాం. తమిళ వెర్షన్‌ని మాత్రం డైరెక్ట్‌గా ఓటిటిలో విడుదల చేస్తున్నాం. 
 
రామ్‌కి ఇతర భాషల్లో పెరిగిన మార్కెట్ రీత్యా ఇలా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులనీ ఆకట్టుకుంటుంది. అలాగే తెలుగు వెర్షన్ గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ ద్వారా ఓవర్సీస్‌లో కూడా విడుదల చేస్తున్నాం. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్‌లలో రిలీజ్ చేస్తున్నాం.
 
వసూళ్ల కోణంలో కాకుండా ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయా ఏరియాల పరిస్థితుల్ని బట్టి కొన్నికొన్ని చోట్ల విడుదల చేస్తున్నాం. ఇంకొన్ని థియేటర్లు పెంచమని అడుగుతున్నారు. ఏదిఏమైనా ‘రెడ్’ చిత్రం ఈ సంక్రాంతికి మంచి అనుభూతిని అందిస్తుంది” అని తెలిపారు. 
 
న‌టీన‌టులు: రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌, నాజ‌ర్ తదితరులు. సాంకేతిక నిపుణులు: సంస్థ‌: శ్రీ స్ర‌వంతి మూవీస్‌, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్‌, దర్శకత్వం: కిశోర్‌ తిరుమల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments