Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాలు ఆరబోసినా అట్టర్ ఫ్లాప్ అయిన 'సామ్.. శ్యామ్'

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (15:24 IST)
కరోనా లాక్డౌన్ సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహా. తెలుగు బుల్లితెరపై అక్కినేని వారి కోడలు, అందాల నటి సమంత తొలిసారిగా హోస్ట్‌గా వ్యవహరించింది. అదే 'సామ్ జామ్'. ఈ పేరు, తొలి ట్రయిలర్ విడుదల కాగానే అంచనాలు ఎంతో పెరిగాయి. 
 
షో ప్రారంభమైన తర్వాత ప్రేక్షకుల నుంచి అంత స్పందన రాలేదు. ఇది టీవీ చానెల్స్‌లో ప్రసారం కాకపోవడం, కేవలం ఓటీటీ ప్లాట్ ఫామ్‌గా ఉన్న 'ఆహా'లో మాత్రమే విడుదల అవుతుండటంతో దీనికి వీక్షకుల నుంచి అతి తక్కువ స్పందన వచ్చినట్టు సమాచారం. దీంతో కార్యక్రమాన్ని ముందుగా అనుకున్నన్ని ఎపిసోడ్లు కాకుండా, ముందుగానే గుమ్మడి కాయ కొట్టేసినట్టు తెలుస్తోంది. 
 
తొలి సీజన్‌లో మొత్తం పది షోలను చిత్రీకరించాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇందులోభాగంగా, మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ వంటివారితో ఎపిసోడ్‌లు నిర్వహించారు. అయితే, చివరి సీజన్‌లో సమంత భర్త నాగ చైతన్య ఇంటర్వ్యూ వచ్చింది. 
 
అంతకుముందు అల్లు అర్జున్‌తో వచ్చిన ఎపిసోడ్ సైతం తీవ్ర నిరాశ పరిచిందని రేటింగ్స్ తెలుపుతున్నాయి. ఇక ఈ షో కేవలం యూట్యూబ్‌లోని చానెళ్లు, సినిమా వార్తలు రాసుకునే వెబ్‌సైట్లకు కొన్ని వార్తలను ఇచ్చిందే తప్ప, తెలుగు సినీ, టీవీ ప్రేక్షకులను అలరించలేదని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments