Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ప్రేమెంత పనిచేసె నారాయణ' రిలీజ్ తేదీ ఖరారు..

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (17:31 IST)
జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు తన కుమారుడైన హరికృష్ణను మొదటి సారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్నారు. హరికృష్ణ మొదటి చిత్రానికి తన తండ్రి జొన్నలగడ్డ శ్రీనివాసరావుగారే దర్శకత్వం వహించారు. చిత్రం పేరు 'ప్రేమెంత పనిచేసె నారాయణ'. ఇందులో అక్షిత హీరోయిన్‌గా నటించారు. అలానే ఝాన్సీ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.  
 
సావిత్రి జొన్నల గడ్డ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 22వ తేదీనా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నటుడు శ్రీకాంత్ వచ్చారు. ఈ సినిమా సంగీత దర్శకుడు యాజమాన్యకు తొలి జ్ఞాపికను అందజేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ జొన్నలగడ్డ శ్రీనివాసరావుగారికి సినిమాలు తప్ప మరో ప్రపంచం తెలియదని.. ఆయన కుమారుడు హరికృష్ణని హీరోగా పరిచయం చేస్తూ... తనే ఈ చిత్రానికి అన్ని బాధ్యతలను తీసుకుని శ్రమించారని చెప్పుకొచ్చారు.
 
అంతేకాదు.. హరి బాగా హార్డ్‌వర్క్ చేస్తాడు. ఇంకా చెప్పాలంటే.. భవిష్యత్తులో హరి మంచి స్టార్ హీరో అవుతాడని శ్రీకాంత్ అన్నారు. తరువాత శ్రీనివాసరావుగారు మాట్లాడుతూ.. కథను నమ్మి చేసిన చిత్రమిది. ఈ కథకు ఎంతో మంది ఎన్నెన్నో సలహాలు ఇచ్చారు. కానీ, నాకు నచ్చలేదు.. అందుకే నేను తీయాలనుకున్నది తీసాను అన్నారు. అలానే హిందీ డబ్బింగ్ రైట్స్‌కు కూడా ఈ చిత్రానికి మంచి ధర దక్కింది. ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న నిర్మాత అల్లు అరవింద్‌గారి సహకారం మర్చిపోలేనిదని చెప్పారు. చివరగా హరి.. ప్రేమకు ఓ కొత్త అర్థం చెప్పే చిత్రమిది. అంతేకాదు.. స్నేహం విలువను చాటిచెప్పే కథ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments