Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరవీరుల కుటుంబాలకు ‘మా’ విరాళం

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (15:49 IST)
పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ‘మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)’ ముందుకొచ్చింది. తమ వంతు సాయంగా 5 లక్షల రూపాయల విరాళాన్ని ‘మా’ ప్రకటించింది. మా అధ్యక్షుడు శివాజీరాజా, జనరల్ సెక్రెటరీ డాక్టర్ వి. కె నరేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జవాన్ల త్యాగం మరువలేనిదని, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
 
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే ఉగ్రవాది కారు బాంబుతో దాడి చేసిన విషయం విదితమే. ఆ దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఉగ్రదాడిలో కేవలం ఒక వ్యక్తి(ఆత్మాహుతికి పాల్పడ్డ ఉగ్రవాది) కారణంగా ఇంత భారీ మొత్తంలో జవాన్లు మరణించడం ఇదే తొలిసారి. 
 
జవాన్లపై దాడి విషయం తెలిసి యావత్తు భారతావని కన్నీరు పెడుతోంది. అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఇప్పటికే చాలామంది ముందుకొచ్చి సాయం ప్రకటించారు. సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో కలిసి జీవించాలని ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కసాయితల్లి!!

ప్రపంచంలోనే తొలిసారి.. ఫ్లైయింగ్ ట్యాక్సీలు.. ఎక్కడ?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments