Webdunia - Bharat's app for daily news and videos

Install App

500 థియేట‌ర్ల‌లో `నాగ‌భ‌ర‌ణం`... అరుంధతిని మరిపిస్తుందా...?

`నాగ‌భ‌ర‌ణం` చిత్రాన్ని మ‌ల్కాపురం శివ‌కుమార్‌ తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్‌ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పెన్‌ మూవీస్‌, ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌, బ్లాక్‌బస్టర్‌ స్టూడియో పతాకాలపై జయంతి ల

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (20:27 IST)
`నాగ‌భ‌ర‌ణం` చిత్రాన్ని మ‌ల్కాపురం శివ‌కుమార్‌ తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్‌ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పెన్‌ మూవీస్‌, ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌, బ్లాక్‌బస్టర్‌ స్టూడియో పతాకాలపై జయంతి లాల్‌ గాడా, సాజిద్‌ ఖురేషి, సొహైల్‌ అన్సారీ నిర్మిస్తున్నారు. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాపై అక్టోబ‌ర్ 14న విడుద‌ల చేస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా గురువారం మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ ``తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రూపొందుతోందీ చిత్రం. మా సుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై విడుద‌ల చేస్తున్నాం. విజువ‌ల్ వండ‌ర్‌గా ఉంటుంది చిత్రం. రీరికార్డింగ్ చేసిన‌ప్పుడు చూసిన వారంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. మ‌కుట సంస్థ విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్దింది. లేని మ‌నిషిని సృష్టించి ఇందులో అద్భుతం చేశారు. 
 
అమ్మోరు, అరుంధ‌తి చిత్రాలు మ‌హిళ‌ల‌ను ఎలా ఆక‌ట్టుకున్నాయో, అలా ఈ సినిమా ఆక‌ట్టుకుంటుంది. ఆ చిత్రాల‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉందీ చిత్రం. గ‌తంలో అక్టోబ‌ర్ నెల‌లోనే `కార్తికేయ‌` చిత్రాన్ని విడుద‌ల చేశాం. ఇప్పుడు ఈ సినిమాలోనూ పాము ఉంది. ఈ చిత్రం కూడా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ లాంఛ్ అయ్యాక ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. ట్రైల‌ర్‌తో పోలిస్తే సినిమా 100 రెట్లు బాగా వ‌చ్చింది. 500 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నాం. ఓవ‌ర్సీస్‌లోనూ విడుద‌ల చేస్తున్నాం`` అని తెలిపారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments