Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీ నెం.150 ఐటమ్ గర్ల్‌గా కేథరిన్ అవుట్.. రాయ్ లక్ష్మీ ఇన్.. ట్విట్టర్లో ఫోటో..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నెం.150 నుంచి ఐటమ్ గర్ల్ కేథరిన్ తీసేసిన నేపథ్యంలో.. ఐటమ్ గర్ల్‌గా లక్ష్మీరాయ్‌ను చిందులేయించాలని సినీ యూనిట్ భావిస్తోంది. ఇటీవల 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (19:42 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నెం.150 నుంచి ఐటమ్ గర్ల్ కేథరిన్ తీసేసిన నేపథ్యంలో.. ఐటమ్ గర్ల్‌గా లక్ష్మీరాయ్‌ను చిందులేయించాలని సినీ యూనిట్ భావిస్తోంది. ఇటీవల 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' చిత్రంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌తో కలిసి స్టెప్పులేసిన నటి రాయ్‌లక్ష్మి ప్రస్తుతం అన్నయ్యతో స్టెప్పులేసేందుకు సై అంటోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో జూలీ2 సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ సినిమా అనేసరికి ఎగరి గంతేసింది.. అన్నయ్యతో చిందులేసేందుకు ఛాన్సొచ్చిందని హ్యాపీగా ఫీలవుతోంది. 
 
ఈ మేరకు చిరుతో కలిసి ప్రత్యేక గీతంలో ఆడిపాడుతున్నట్లు రాయ్‌లక్ష్మి తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ధృవీకరించారు. తొలుత ఈ ప్రత్యేక గీతానికి కేథరిన్‌ను అనుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ సెట్స్‌లో డ్యాన్స్‌ వేస్తుంటే ప్రతి ఒక్కరికీ ఫ్యాన్‌ మూమెంటే.. అంటూ చిత్ర బృందం చెర్రీ, లారెన్స్‌, వి.వి.వినాయక్‌ సెట్‌లో దిగిన ఫొటోలు పోస్ట్‌ చేసింది. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది.
ఇకపోతే.. కేథరిన్ మెగాస్టార్ ఐటమ్ గర్ల్ రోల్ నుంచి తప్పుకోవడానికి కారణాలేంటందనే దానిపై రచ్చ జరుగుతోంది. చిరు 150 సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఎంచుకున్న హీరోయిన్ కేథరిన్‌ను అకస్మాత్తుగా సినిమాలో నుంచి తీసేశారు. దీనికి కారణంగా నృత్య దర్శకుడు లారెన్స్‌తో ఈ భామ గొడవపడటమేనని అందరూ చెప్పుకుంటున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments