Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 11న అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్.!

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (14:35 IST)
గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపులర్ హీరో ఇప్పుడు టాక్సీవాలా అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎస్కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా.... రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. 
 
ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్, సాంగ్స్, ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ అంచనాల్ని మరింత పెంచే విధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేశారు. ఈ నెల 11న జరగబోయే ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తుండంటం విశేషం. టాక్సీవాలా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.... మంచి ప్రశంసలు అందుకుంది. యు.ఏ సర్టిఫికెట్‌తో టాక్సీవాలా నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ మాట్లాడుతూ... విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం. విజ‌య్ ఇమేజ్‌కి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్టైన్ చేసే విధంగా దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. గీత గోవిందం వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఏర్పడిన అంచనాలను దృష్టిలో ఉంచుకొని టాక్సీవాలాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాం. ఈ నెల 11న జరగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను కూడా భారీగా ప్లాన్ చేశాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. 
 
ఇక ఈ చిత్రం సెన్సార్ సభ్యుల నుంచి వచ్చిన ప్రశంసలు మాలో మరింత కాన్ఫిడెన్స్‌ను పెంచాయి. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్‌గా నిర్మించాం. హిలేరియస్ సస్పెన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం అని అన్నారు.
 
విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైనర్ - అనంత్ కంచర్ల, పిఆర్ఓ - ఏలూరు శ్రీను, సౌండ్ - సింక్ సినిమా, స్టంట్స్ - జాషువా
ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి, లిరిక్స్ - కృష్ణ కాంత్, మ్యూజిక్ - జేక్స్ బిజాయ్, ఎడిటర్, కలరిస్ట్ - శ్రీజిత్ సారంగ్, సినిమాటోగ్రాఫర్ - సుజిత్ సారంగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - సాయి కుమార్ రెడ్డి, నిర్మాత - ఎస్ కె ఎన్ (SKN), ప్రొడక్షన్ హౌజ్ - జీఏ 2 పిక్చర్స్ మరియు యువి క్రియేషన్స్ 
స్టోరీ, డైరెక్షన్ - రాహుల్ సంక్రిత్యాన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments