Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడపదాటి ప్రతి గడపలోకి వెళ్లిన యాత్ర.. యూట్యూబ్‌ షేక్ (టీజర్)

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. ఈ చిత్రానికి "ఆనందోబ్రహ్మ" ఫేమ్‌ మహి వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తుంటే, వైఎస్ఆర్‌గా మలయాళ సూపర్ స్టార్ మమ

Webdunia
సోమవారం, 9 జులై 2018 (16:49 IST)
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. ఈ చిత్రానికి "ఆనందోబ్రహ్మ" ఫేమ్‌ మహి వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తుంటే, వైఎస్ఆర్‌గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైనమెంట్స్ పతాకంపై విజయ్ చల్లా, శశిదేవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
 
అయితే, జూలై 8వ తేదీ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో కొన్ని గంటల్లోనే ఈ టీజర్ 10 లక్షలకి పైగా వ్యూస్‌ను రాబట్టింది. అదే ఊపును కొనసాగిస్తూ ఇప్పుడు ఈ టీజర్ 12 లక్షలకి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 
 
గూగుల్ ట్రెండ్స్‌లోనూ ఈ టీజర్ ప్రముఖంగా నిలిచింది. ఇక ఫేస్‌బుక్.. వాట్సాప్‌లలోనూ ఈ టీజర్ అదే జోరును కొనసాగిస్తోంది. వాట్సాప్‌లో చాలామంది స్టేటస్‌లో ఈ సినిమా టీజర్ కనిపించడం విశేషం. ఈ సినిమా టీజర్‌కి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం పట్ల యూనిట్ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, ఈ టీజర్‌లో వైఎస్ఆర్‌గా మమ్ముట్టి అతికినట్టు సరిపోయారు. పంచకట్టులో అచ్చం వైఎస్ఆర్ లాగే మలయూళ సూపర్ స్టార్ మమ్ముట్టి చేస్తున్న అభివాదం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. 
 
ఈ టీజర్‌లోని డైలాగ్‌లు అద్భుతంగా ఉన్నాయి. "తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ గడపదాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వారితో కలిసి నడవాలని ఉంది.. వారి గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు.. ఓడితే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర మూర్ఖత్వమో లేక పట్టుదలో చరిత్రే నిర్ణయిస్తుంది"అంటూ సాగే టీజర్ అభిమానుల్లో మూవీపై అంచనాలు పెంచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments