Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి సనూష పెదవులను తాకాడు.. రైలులో నిద్రిస్తున్నప్పుడు.. ఏ ఒక్కరూ?

మొన్నటికి మొన్న భావన, నిన్నటికి నిన్న అమలా పాల్ లైంగిక వేధింపులకు గురైయ్యారు. నేడు మలయాళ యంగ్ హీరోయిన్ సనూషా అత్యాచార వేధింపులకు గురైంది. నటి అమలాపాల్‌ను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యాపారవేత్తను చెన

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (12:07 IST)
మొన్నటికి మొన్న భావన, నిన్నటికి నిన్న అమలా పాల్ లైంగిక వేధింపులకు గురైయ్యారు. నేడు మలయాళ యంగ్ హీరోయిన్ సనూషా అత్యాచార వేధింపులకు గురైంది. నటి అమలాపాల్‌ను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యాపారవేత్తను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మరవకముందే  రైలులో నిద్రిస్తున్న సమయంలో సనూషపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వ్యక్తి.
 
ఈ ఘటన కున్నూర్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న రైలులో చోటుచేసుకుంది. రైలులో ప్రయాణం చేస్తున్న సనూషపై తమిళనాడుకు చెందిన వ్యక్తి ఆంటోబోస్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో వేధించాడు. దీనిపై సనూష టీటీఈకీ ఫిర్యాదు చేసింది. వెంటనే రైల్వే పోలీసులు ఆంటోబోస్‌ను అరెస్ట్ చేశారు. ఇకపోతే.. నటి సనూషా మలయాళ నటి. ఈమె తమిళంలో రేణిగుంట, భీమ చిత్రాల్లో నటించిది. ఇటీవల శశికుమార్‌ చిత్రం కొడివీరన్‌లోనూ నటించింది. 
 
తనకు ఎదురైన ఘటనపై సనూష సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో తన పెదవులను 40 ఏళ్ల వ్యక్తి తాకాడని, వెంటనే మేల్కొన్నానని.. లైట్ వేసి.. అతని చెయ్యి పట్టుకున్నానని తెలిపింది. ఆపై తాను చైన్ లాగి రైలును ఆపానని చెప్పింది. ఆ సమయంలో రైలులో ఎంతోమంది ప్రయాణికులున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని, అపర్ బెర్త్‌లో వుండి.. తనను వేధించిన వ్యక్తిని పోలీసులకు పట్టించేందుకు ఉన్ని అనే రచయిత, రంజిత్ అనే వ్యక్తులు తనకు సాయం చేశారని వెల్లడించింది. 
 
మహిళలు ఇలాంటి వేధింపులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని.. సమాజంపై నమ్మకం పోయిందని.. మహిళలే ధైర్యంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనాలని పిలుపునిచ్చింది. పోలీసుల జోక్యంతో వ్యక్తి అరెస్టయ్యాడని, తన కుటుంబం తనకు అండగా నిలిచిందని సోషల్ మీడియాలో సనూష చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం