Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూల్స్ మీరు అమ‌లు చేయండి - మాకు చెప్ప‌కండి

Webdunia
బుధవారం, 27 జులై 2022 (16:45 IST)
Ramasathyanarayana
పెద్ద నిర్మాత‌లు రీష్యూట్‌లు హెవీ పారితోషికాలు మానుకోండి. అప్పుడే నిర్మాణ వ్య‌యం త‌గ్గుతుంది. మీరు రూల్స్ అమ‌లు చేయండి. మాకు చెప్ప‌కండి నీతులు అంటూ వంద సినిమాలు నిర్మించిన తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ స‌వాల్ విసిరారు. 
 
- ప్ర‌స్తుతం కాస్ట్ పెరిగిపోతుంద‌ని చెప్పి షూటింగ్‌లు ఆపేస్తామంటూ ప్రెస్‌నోట్ విడుద‌ల‌చేయ‌డం ఏమిటి? అని ప్ర‌శ్నించారు. ముందు మీరు సినిమాలు తీసే విధానం మార్చుకోండి. ల‌క్ష‌లు, కోట్లు ఇచ్చి ప‌ర‌బాషా న‌టీన‌టుల‌ను తీసుకువ‌చ్చి వారికి సౌక‌ర్యాలు క‌లిగించేవిధానంలో కొత్తద‌నం చూపండి అని తెలియ‌జేశారు.
 
- మీ నోటివెంట భ‌యం అనే మాట మీ అభిమానిగా నేను విన‌లేన‌ని మీరు చాలా తోపు అని దిల్‌రాజు నుద్దేశించి తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ అన్నారు.
 
- ఓటీటీ పేరుతో మీరే థియేట‌ర్‌ల‌కు ముందుగానే అమ్మేయడం, ఇప్పుడు స‌సేమిరా అన‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. టికెట్ రేటు పెంచింది మీరే. ఇప్ప‌డు త‌గ్గించాల‌ని అంటున్నారు. అప్ప‌ట్లోనే రేటు పెంచ‌వ‌ద్ద‌ని చిన్న నిర్మాత‌లు చెప్పారుక‌దా. ఆ విష‌యం మీకు గుర్తులేదా అని నిల‌దీశారు.
 
- మీరు ఇండ‌స్ట్రీని శాసించే స్థాయిలో వున్నారు. పెద్ద‌రికం అంట‌గ‌ట్టారు మీకు. మీరు సినిమాలు మానేస్తే మానేయండి. కానీ మాలాంటి చిన్న నిర్మాత‌ల‌ను షూటింగ్ చేసుకోనివ్వండి. మీరు గిల్డ్ పేరుతో వుంటే 20 మంది వుంటారు. కానీ మేం 200 మంది నిర్మాత‌లం. ఈ విష‌యాన్ని మీరు గ‌మ‌నించాల‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments