Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమోషనల్‌గా సాగే 'ఏందిరా ఈ పంచాయితీ' టీజర్

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (19:08 IST)
విలేజ్ లవ్ స్టోరీ, ఎమోషనల్ డ్రామాగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే చిత్రం రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో  హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది వరకు ఈ చిత్రం నుంచి విడుదలు చేసిన టైటిల్ లోగో, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు.
 
80 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో అన్ని రకాల ఎమోషన్స్, యాక్షన్, కామెడీ, లవ్, థ్రిల్లర్ జానర్‌లను చూపించారు. ‘కళ్లు మోసం చేశాయేమో అని నువ్ అంటున్నావ్.. కట్టుకోబోయేవాడు మోసం చేస్తాడేమో అని నేను అనుకుంటున్నా’.. ‘వయసైపోయాక తండ్రిని వదిలేసే కొడుకులు ఉన్నారు కానీ.. చెడిపోయాడని కొడుకుని వదిలేసే తండ్రులు లేరు’.. అంటూ సాగే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
 
ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 
సాంకేతిక బృందం
బ్యానర్ : ప్రభాత్ క్రియేషన్స్
నిర్మాత : ప్రదీప్ కుమార్. ఎం
డైరెక్టర్  : గంగాధర. టి
కెమెరామెన్  : సతీష్‌ మాసం
సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్)
మాటలు  : వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల
ఎడిటర్ :  జేపీ
డీఐ  : పీవీబీ భూషణ్ 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments