Webdunia - Bharat's app for daily news and videos

Install App

చూపించేందుకు ఒకరిని మించి మరొకరు రెచ్చిపోతున్నారు...

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (12:25 IST)
అంచనాలకు భిన్నంగా భారీ సక్సెస్‌లు సాధించిన చిత్రాలు 'అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100'. ఈ రెండు సినిమాలు హిట్ అయిన తర్వాత టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ ఆరంభమైంది. ముద్దుసీన్లతో పాటు శృంగార సన్నివేశాలతో కూడిన టీజర్లను విడుదల చేయడం పరిపాటిగా మారిపోయింది. 
 
నిజానికి 'ఆర్ఎక్స్ 100' చిత్రంలో కిస్ అండ్ సెక్స్ సీన్లే కీలక పాత్రను పోషించాయి. అయితే, ఈ రెండు అంశాలవల్లే ఈ చిత్రం సూపర్ హిట్ అయిందని చెప్పలేం. ఈ చిత్రంలో గతానికి భిన్నంగా హీరోయిన్‌ను విలన్‌గా చూపించారు. ఈ సరికొత్త ట్రెండ్ ప్రేక్షకులకు నచ్చడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 
 
అయితే, ఇపుడు ఆ పాయింట్‌ను పక్కనబెట్టి... బోల్డ్ కంటెంట్‌తో చిత్రాలు తీసి ప్రేక్షకులను ఆకర్షించాలన్న పంథాలో దర్శకుల ఆలోచనా ధోరణివుంది. అలా వచ్చిన చిత్రాల్లో "రథం", "నాటకం" వంటి చిత్రాలు ఇదే పబ్లిసిటీ మంత్రాన్ని పాటించాయి. కానీ, ఈ రెండు చిత్రాలు బొక్క బోర్లాపడ్డాయి. తాజాగా "ఏడు చేపల కథ" అనే సినిమా మరింత బోల్డ్‌గా తీసినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఆ చిత్ర టీజర్‌ను చూస్తేనే తెలుస్తోంది. ఫలితంగా ఈ చిత్ర టీజర్ ఇప్పటికే 18 మిలియన్స్ వ్యూస్‌ను రాబట్టి సరికొత్త ట్రెండ్‌ను సృష్టించింది. 
 
ఇపుడు రాయలసీమ లవ్‌స్టోరీ అనే సినిమా ఇదే పంథాని ఫాలో అవుతోంది. ఇప్పటివరకు రాయలసీమ నేపథ్యంలో రక్తపుటేరులు పారించిన చిత్రాలు చూశాం. కానీ, ఈ చిత్రంలో రాయలసీమలో ఉండే రంజైన ప్రేమను చూపనున్నారు. పైగా ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకునేందుకు బోల్డ్ పోస్టర్‌తో పాటు... టీజర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jayalalithaa: దివంగత సీఎం జయలలిత ఆస్తులన్నీ ఇక తమిళనాడు సర్కారుకే

కణతకు గురిపెట్టుకుని తుపాకీతో కాల్చుకున్న ఎస్ఐ.. పాపం జరిగిందో..?

International Zebra Day 2025: జీబ్రా దినోత్సవం: నలుపు-తెలుపు చారలు వాటిని కాపాడుకుందాం..

భర్తను వదిలేసి పరాయి పురుషుడితో అక్రమ సంబంధం.. ఆపై ఆర్టీసీ డ్రైవరుపై మోజు.. చివరకు..

గుజరాత్‌లో నాలుగేళ్ల బాలుడుకి హెచ్ఎంపీవీ వైరస్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం