Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్ మూవీ : దాసరి పాత్రధారి ఎంపిక?

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (11:18 IST)
బాలకృష్ణ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత, రాజకీయ చరిత్ర ఆధారంగా "ఎన్టీఆర్ బయోపిక్" పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగాసాగతోంది. వచ్చే యేడాది సంక్రాంతి పండుగకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
రెండు పార్టులుగా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో భారీ తారాగ‌ణం నటిస్తోంది. ఎన్టీఆర్ సినిమా జీవితంతో పాటు రాజ‌కీయ జీవితాన్ని కూడా వెండితెర‌పై చూపించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. అయితే ఇప్ప‌టికే చిత్రంలో ప‌లువురు ద‌ర్శ‌కుల‌ని వేరు వేరు పాత్ర‌ల కోసం ఎంపిక చేయ‌గా, మాస్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్‌ని ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు పాత్ర కోసం ఎంపిక చేసిన‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.
 
కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం దర్శకుడు చంద్ర సిద్ధార్ధ్‌ని దాస‌రి పాత్ర కోసం ఎంపిక చేశారని, ఆయ‌న‌కి సంబంధించిన స‌న్నివేశాల‌ని త్వర‌లోనే తెర‌క‌కెక్కించనున్నార‌ని అంటున్నారు. చంద్ర సిద్ధార్థ్‌కి దాస‌రి పోలిక‌లు ఉండ‌టంతో ఆయ‌న‌ని ఎంపిక చేసిన‌ట్టు సమాచారం. 
 
ఇకపోతే, ఎన్టీఆర్ చిత్రంలో గుమ్మడిగా దర్శకుడు దేవి ప్రసాద్ న‌టిస్తుంటే, కేవీ రెడ్డిగా క్రిష్, విఠలాచార్యగా ఎన్ శంకర్ క‌నిపించ‌నున్నారు. ఎన్.బి.కె. ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. 
 
చిత్రంలో ఎన్టీఆర్‌గా బాల‌య్య, అక్కినేనిగా సుమంత్‌, హెచ్ ఎం రెడ్డిగా స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీదేవిగా ర‌కుల్, హ‌రికృష్ణగా క‌ళ్యాణ్ రామ్, బ‌స‌వ‌తార‌కంగా విద్యా బాల‌న్, చంద్ర‌బాబుగా రానా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణులు సహ నిర్మాతలుగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

15ఏళ్లలో నలుగురిని పెళ్లాడిన మహిళ.. పేర్లు మార్చుకుని పెళ్లయ్యాక జంప్!

వైకాపా నేతలు వేధించారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన యువకుడు తెల్లారేసరికి శవమై తేలాడు...

ఆ సాకు చెప్పి ప్రియుడితో భార్య రాసలీలలు: చీకట్లో వెతికి పట్టుకుని హత్య చేసాడు

హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చి ఇద్దరిని హత్య చేసి లారీ డ్రైవర్!!

Pawan Kalyan: నారా దేవాన్ష్‌ను అభినందించిన పవన్ కల్యాణ్ - ఎందుకో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments