Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాశ్వ‌తంగా వై.సి.పి., అధికారంలో వుండ‌దు - మాకు మీలా దాచుకోవ‌డం తెలీదు - నాగ‌బాబు ఫైర్‌

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (10:46 IST)
Nagababu,
గ‌త కొద్దికాలంగా సినిమా టికెట్ల రేట్ల విష‌యంలో వ‌స్తున్న విమ‌ర్శ‌లు, వాద‌న‌లు వింటూవున్నాను. వై.సి.పి. ప్ర‌భుత్వం మంత్రుల‌కు సినిమా ప‌రిశ్ర‌మ ఎలా వుంటుందో తెలీదు. చాలా తేలిక‌భావంతో, అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. పేద‌వాడికి త‌క్కువ రేటుకే సినిమా చూపించ‌మంటున్నారు. దానికి అంగీక‌రించాల్సిందే. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌ను ఆయ‌న తెలియ‌జేశారు.
 
- మ‌న ప్ర‌పంచ సినిమాతో పోటీ ప‌డుతున్న‌పుడు రిచ్‌నెస్ చూపించాలి. చాలా మంది హీరోలు 20 నుంచి 30శాతం రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకున్నారు. చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌హేష్‌బాబు, ఎన్‌.టి.ఆర్. ప్ర‌భాస్‌, వ‌రుణ్ తేజ్ ఇలా ఎంతో మంది సినిమా ఆడ‌క‌పోతే వారు త‌మ పారితోషింకాన్ని త‌గ్గించుకున్నారు. అత్తారింటికి దారేది సినిమాను ఓ మూర్ఖుడు పైర‌సీ చేస్తే నిర్మాత‌కు న‌ష్టం వాటిల్లింది. వెంట‌నే క‌ళ్యాణ్‌బాబు త‌న పారితోషికంతో కొంత వెన‌క్కి ఇచ్చేశాడు. ఇలా చాలా ఉదంతాలు వున్నాయి.
 
- సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేట్ వుండాలంటే, హాలీవుడ్‌లో జేమ్స్ కామ్‌రూన్ సినిమాలు ప‌ది రూపాయ‌ల‌కే సినిమా అంటే అస్స‌లు ఇక్క‌డ విడుద‌ల చేయ‌రు. 
 
- మేం ఒళ్ళు హూనం చేసుకుని క‌ష్ట‌ప‌డి సంపాదిస్తున్నాం. టాక్స్‌లు క‌డుతున్నాం. సామాజిక సేవ‌లు చేస్తున్నాం. 
- మీలా రాజ‌కీయ‌నాయ‌కుల్లా మాకు వైట్ కాల‌ర్ తో కూర్చుంటే డ‌బ్బులురావు. మేం ఏమీ దాచుకోలేం. అలా మీలా వుండ‌కూడ‌ద‌నుకుంటున్నాం.
 
- చైనా, ర‌ష్యా అధ్య‌క్షులుగా శాశ్వ‌తంగా ప్ర‌భుత్వాల‌ను రాష్ట్రంలో పాలించ‌లేరు. కొద్దికాల‌మే. శాశ్వ‌తంగా వై.సి.పి. వుండ‌దు. అలా వుండ‌కూడ‌నే అప్ప‌ట్లోనే గ్ర‌హించి ఐదేళ్ళ‌కోసారి ఎల‌క్ష‌న్ లు జ‌ర‌గాల‌ని అంబేద్క‌ర్ రాజ్యాంగంలో రాశారు. అంటూ ఘాటుగా స్పందించారు నాగ‌బాబు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments