Webdunia - Bharat's app for daily news and videos

Install App

'యాత్ర' సూపర్ డూపర్ హిట్.. ఒత్తిడిలో బాలకృష్ణ

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (09:23 IST)
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "యాత్ర". మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఈనెల 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా, వీకెడ్ అయిన శనివారం, ఆదివారం మాత్రం యాత్ర కలెక్షన్లు దుమ్మురేపాయి. 
 
ఈ చిత్రం విడుదలైన తొలి రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు రూ.4 కోట్ల వ‌ర‌కు గ్రాస్ వ‌సూలు చేసింది. రెండో రోజు కూడా రెండున్న‌ర కోట్ల‌కు పైగా గ్రాస్.. కోటిన్న‌ర వ‌ర‌కు షేర్ తీసుకొచ్చిన‌ట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మూడు రోజుల‌కు కానీ రూ.5 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొచ్చిన‌ట్లు తెలుస్తుంది. మూడో రోజు మార్నింగ్ షో నుంచే దుమ్ము దులిపేసింది. 
 
ఆదివారం కావ‌డంతో వ‌సూళ్లు కూడా భారీగానే పెరిగాయి. మ‌రో రెండు వారాల వ‌ర‌కు సినిమాలే లేక‌పోవ‌డం కూడా యాత్ర‌కు క‌లిసి రానుంది. తమిళ హీరో కార్తీ నటించిన 'దేవ్' చిత్రం విడుదల కానుంది. అయినప్పటికీ ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. దీంతో యాత్ర మాత్రం మంచి కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోది. 
 
ఇకపోతే, ఈ చిత్ర విజయంలో ప్రధానంగా మ‌మ్ముట్టి న‌ట‌న‌.. మ‌హి వి రాఘ‌వ్ టేకింగ్.. వైఎస్ అభిమానులు.. అన్నింటికి తోడు పాజిటివ్ టాక్‌లు కీలక పాత్ర పోషించాయి. ఇలా ఇప్పుడు అన్నీ 'యాత్ర' సినిమాకు క‌లిసొస్తున్నాయి. దాంతో వైకాపా వ‌ర్గాల్లో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. 'యాత్ర' సినిమా సూపర్ హిట్ కావడంతో స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆధారంగా తీసిన 'ఎన్టీఆర్ కథానాయుకుడు' హీరో, నిర్మాత బాలకృష్ణపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా, ఈ చిత్రం తొలి భాగంగా వచ్చిన 'ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు' అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. కానీ, అదే బయోపిక్‌తో వచ్చిన 'యాత్ర' మాత్రం అద్భుతం చేస్తుండటంతో బాలకృష్ణతో పాటు దర్శకుడు క్రిష్, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైద్యానికి వచ్చిన యువతిపై మేల్ నర్స్ అత్యాచారం.. ఎక్కడ?

IMD: విజయనగరంలో పిడుగులు పడి ముగ్గురికి గాయాలు, 30 గొర్రెలు మృతి

సముద్రంలో తెగిన ఇంటర్నెట్ కేబుల్స్ - హౌతీ రెబెల్స్ పనేనా?

బ్లడ్ చంద్రగ్రహణం : తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

పరప్పణ అగ్రహార జైలులో లైబ్రరీ క్లర్క్‌గా మాజీ ఎంపీ రేవణ్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments