Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలం పనుల్లో బిజీ బీజీగా వున్న కేజీఎఫ్ స్టార్..

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:26 IST)
Yash
కేజీఎఫ్ స్టార్ యష్ పొలం పనుల్లో బిజీ బీజీగా వున్నాడు. తన సొంతూరు హసన్‌‌లో ఈ మధ్యనే యష్‌ వంద ఎకరాలు కొనుగోలు చేశాడని వీటి విలువ రూ.80 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వచ్చాయి. 
 
ఈ మధ్యనే ఈ పొలం విషయంలో హీరో కుటుంబానికి, గ్రామస్తులకు మధ్య గొడవలు జరిగి విషయం జిల్లా కలెక్టర్‌ వరకు వెళ్లింది. సరే ఇప్పడా విషయాలను పక్కన పెడితే.. ఈ స్టార్‌ హీరో పొలంలో ఏం పండిస్తాడో చూద్దామంటే అక్కడక్కడ కొన్నిచెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు ఫోటోల్లో చూస్తే తెలిసిపోతోంది.
 
ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చామన్నది మరవకూడదు. ఆ మాటని మా హీరో తూచా తప్పకుండా పాటిస్తాడని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనమంటూ అభిమానులు వీటిని షేర్‌ చేసుకుంటున్నారు. ఇకపోతే.. కెజిఎఫ్‌-2 రిలీజ్‌‌కి రెడీగా ఉంది.
 
ప్రశాంత్‌ నీల్‌ డైరక్షన్‌‌లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత యష్‌ ఏ దర్శకుడితో చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కన్నడ దర్శకుడు నర్తన్‌తో సినిమాకి హీరో యష్ కమిట్‌ అయ్యాడని వార్తలు వచ్చినా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments