కేజీఎఫ్ ఛాప్టర్ 2: సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ వైరల్

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (10:27 IST)
కేజీఎఫ్ ఛాప్టర్ 1 భారీ కలెక్షన్లతో కుమ్మేసింది. భారత సినిమా ఇండస్ట్రీని కేజీఎఫ్ షేక్ చేసేసింది. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళం, హింది భాషల్లో విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా దెబ్బకు యాష్ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. కథ మీద నమ్మకం ఉండటంతో హంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది.
 
కోలార్ గోల్డ్ మైన్స్, ముంబై మాఫియా ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. ఐదు భాషల్లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 238 కోట్ల వసూళ్లను సాధించి రికార్డ్ సృష్టించింది. అధీరా తమ్ముడు గరుడని హీరో చంపడంతో ముగిసిన తొలి పార్ట్.. అక్కడి నుంచి రెండో పార్ట్ మొదలు కానుంది. తాజాగా కేజిఎఫ్ పార్టీ 2కి సంబంధించిన లుక్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. 
 
ఈ లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండో పార్ట్‌లో అధీరాగా సంజయ్ దత్ నటిస్తుండగా, దివంగత ప్రధాని ఇందిరా గాంధీని పోలిన పాత్రలో రవీనా టాండన్ నటిస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

వివాహేతర సంబంధం: ప్రియురాలు పరిచయం చేసిన మహిళతో ప్రియుడు కనెక్ట్, అంతే...

మోహన్ బాబు యూనివర్శిటీ గుర్తింపు రద్దా? మంచు విష్ణు ప్రకటన

Mohanbabu: మోహన్ బాబు యూనివర్శిటీ లోని అభియోగాలపై ప్రో-ఛాన్సలర్ ప్రకటన

కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు: ఆరుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments