రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ''కేజీఎఫ్'' సినిమా భారీ కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. 2018లో కేజీఎఫ్ చాప్టర్1 విడుదలైంది. విడుదలైన అన్ని భాషాల్లో అదిరిపోయే కలెక్షన్స్‌తో అదరగొట్టింది కేజీఎఫ్. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషలలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది.
ఈ నేపథ్యంలో కేజీఎఫ్ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కేజిఎఫ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అక్కడ అత్యధికంగా వ్యూస్ సాధించి సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
అంతేకాదు ఈ సినిమా 2019 సంవత్సరానికి గాను అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయిన అన్ని చిత్రాలలో అన్ని భాషలలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా నిలిచి మరో రికార్డ్ నెలకొల్పింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న కేజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో హిందీ నటుడు సంజయ్ దత్ విలన్ 'అధీరా'గా నటిస్తున్నాడు.