Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైథలాజికల్ సస్పెన్స్ మూవీ గా యముడు టీజర్ : నవీన్ చంద్ర

దేవీ
గురువారం, 29 మే 2025 (18:03 IST)
Naveen Chandra, Jagadish Amanchi
కాన్సెప్ట్ బేస్డ్  ఓ మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’. 'ధర్మో రక్షతి రక్షితః' అనే ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ జనాల్లో క్యూరియాసిటీని పెంచేసింది.
 
తాజాగా ‘యముడు’ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. గురువారం నాడు ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. టీజర్‌ను చూసిన అనంతరం చిత్రయూనిట్‌ను అభినందించారు. ఇక ఈ టీజర్‌ను గమనిస్తే ఇదొక మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ అని అర్థం అవుతుంది. సిటీలో ఉన్న అమ్మాయిలు మిస్ అవుతుండటం, నాటకాల్లో యముడు వేషం వేసే వ్యక్తికి ఈ హత్యలకు సంబంధం ఉందేమో అన్నట్టుగా టీజర్‌ను కట్ చేశారు. యముడు భూలోకంకి వచ్చి నరకంలో విధించే శిక్షలన్నీ ఇక్కడే విధిస్తాడేమో అన్నట్టుగా కనిపిస్తోంది.
 
‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ అనే డైలాగ్ చూస్తుంటే, ఈ సినిమా హిందూ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని కొత్త దృక్పథాన్ని చూపించబోతుందన్న ఆసక్తి కలుగుతుంది. హిందు ధర్మం నుంచి ఓ కొత్త పాయింట్‌తో ఆసక్తికరంగా సినిమాను మల్చినట్టు అనిపిస్తుంది. టీజర్‌లో విష్ణు రెడ్డి వంగా కెమెరా వర్క్, భవాని రాకేష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ప్రభావవంతంగా అనిపించింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లను మేకర్లు ప్రకటించనున్నారు.
నటీనటులు : జగదీష్ ఆమంచి, శ్రావణి శెట్టి, ఆకాశ్ చల్లా తదితరులు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments