Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

Advertiesment
Honney poster

దేవీ

, మంగళవారం, 13 మే 2025 (18:02 IST)
Honney poster
‘మట్కా’ దర్శకుడు కరుణకుమార్ ఇప్పుడు నవీన్ చంద్ర తో సినిమా చేస్తున్నాడు. శేఖర్ స్టూడియో బ్యానర్ పై హానీ అనే చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైనది. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర తో పాటు దివ్యా పిళ్ళై , దివి, రాజా రవీంద్ర, కళ్యాణి మాలిక్, బేబీ జయని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటివరకూ భారతీయ సినిమా తెరపై చూడని కథ, కథనాలతో ఈ చిత్రం రూపొందబోతుంది. షూటింగ్ ప్రారంభించిన రోజే పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పోస్టర్ లో కనిపించే పిల్లి,  పాప ఈ సినిమా మూడ్ ని ఎలివేట్ చేసాయి. పోస్టర్ కనిపించే డార్క్ నెస్ మనసులో బలమైన ముద్ర ను వేసింది. 
 
ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లడుతూ, విభిన్నమైన పాత్రలు నా కెరియర్ లో చాలా ఉన్నాయి.  కానీ ఈ మూవీ లో పాత్ర గురించి దర్శకుడు కరుణ కుమార్ చెప్పినప్పుడు కాస్త భయపడ్డాను. ఇలాంటి క్యారెక్టర్ గురించి నేనెప్పుడూ వినలేదు, కానీ ఇలాంటి పాత్రలు ఏ నటుడికైనా అరుదుగా వస్తాయి. “ఈ పాత్ర నాకు కొత్త సవాల్, మరియు కరుణ కుమార్ గారి దర్శకత్వంలో ఈ కథలో భాగం కావడం ఆనందంగా ఉంది,”   ఈ సినిమాలో చాలా కొత్తగా చూడబోతున్నారు అన్నారు.
 
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ, హానీ కథ కు సమాజంలో చాలా రిఫరెన్స్ లున్నాయి. మనిషిలోని ఆశ తీసుకెళ్లే చీకటి ప్రపంచాన్ని  చాలా బోల్డ్ గా తెరమీదకు తీసుకురాబోతున్నాను.నవీన్ చంద్ర నటన, కథ యొక్క లోతు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపే అంశాలు,” అని దర్శకుడు కరుణ కుమార్ తెలిపారు.   ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ గా  హానీ రూపొందిస్తాను. నవీన్ చంద్ర, దివ్యా పిళ్ళై పాత్రలకు సమాజంలో చాలా రిలేటబిలిటీ ఉంటుంది.  అన్నారు.
 
నిర్మాతలు శేఖర్ మాస్టర్, రవి పీట్ల  మాట్లాడుతూ, దర్శకుడు కరుణకుమార్ చెప్పిన కథ మమ్మల్ని చాలా కదిలించింది. నవీన్ చంద్ర, దివ్యా పిళ్ళై ల పాత్రలు చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటాయి. రెగ్యులర్ షూటింగ్ ఈ రోజునుండే మొదలైంది.  43 రోజుల సింగల్ షెడ్యూల్ లో సినిమా కంప్లీట్ చేయబోతున్నాం. సినిమా కోసం కోకాపేట్ లో సెట్ వేశాము. ఇంకా కొన్ని లైవ్ లొకేషన్స్ లో చిత్రీకరణ చేయబోతున్నాం అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్