'రాంగ్ గోపాల్ వర్మ' టైటిల్ లోగో విడుదల చేసిన సోషల్ ఆక్టివిస్ట్ దేవి

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (14:41 IST)
సుప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు, దర్శకుడు ప్రభు తాజాగా 'రాంగ్ గోపాల్ వర్మ' అనే చిత్రం రూపొందిస్తున్నారు. ప్రముఖ హాస్య కథానాయకుడు షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించారు.
 
వ్యక్తులపై తీసే సినిమాలకు స్వతహా తాను వ్యతిరేకమైనప్పటికీ.. సమాజానికి చీడ పురుగులా దాపురించిన వ్యక్తిపై తీసిన 'రాంగ్ గోపాల్ వర్మ' చిత్రాన్ని తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ఏ సమాజం కారణంగా తాను మనుగడ సాగిస్తున్నాడో... ఆ సమాజానికి తాను జవాబుదారీ కాదని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రకటించుకునే వ్యక్తులను సామాజిక బహిష్కరణ చేయాల్సి ఉందని ఆమె ప్రకటించారు.
 
ఈ చిత్రం కోసం సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన పాట తాను విన్నానని, చాలా బాగుందని ఆమె అన్నారు. ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలకు చెంపపెట్టుగా తాను ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నానని, పతాక సన్నివేశాలు, పాట మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుందని రచయిత-దర్శకనిర్మాత ప్రభు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments