Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్‌తో ఇస్మార్ట్ హీరోయిన్, ఇంతకీ ఏ సినిమాలో..?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (14:35 IST)
యువ హీరో నితిన్ భీష్మ సినిమా ఇచ్చిన సక్సెస్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా చేస్తున్నారు. నితిన్ పెళ్లి సందర్భంగా రిలీజ్ చేసిన రంగ్ దే టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రొమాంటిక్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
 
ఈ మూవీలో నితిన్ సరసన కీర్తి సురేష్‌ నటిస్తుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెక్ సినిమాలో చేయనున్నారు. ఈ మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు నితిన్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 
 
 
వీటితో పాటు బాలీవుడ్లో సక్సెస్ సాధించిన సూపర్ హిట్ మూవీ అంధాధున్ రీమేక్‌లో కూడా నటించబోతున్నారు. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ రీమేక్‌కు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. అది ఏంటంటే… ఇందులో నితిన్ సరసన నటించేందుకు నభా నటేష్‌ను ఎంచుకున్నారని తెలిసింది. 
 
హిందీలో రాధిక ఆప్టే నటించిన పాత్రలో నభ నటిస్తుందని సమాచారం. నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలతో అటు గ్లామర్ పరంగా ఇటు నటన పరంగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించింది నభా నటేష్. దీంతో ఈ సినిమాలో రాధిక పాత్రకు నభ పూర్తి న్యాయం చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments