Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు యువతులకు అలాంటి సంబంధం.. పెళ్లి మాటెత్తే సరికి ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 19 మే 2020 (17:46 IST)
ఇద్దరు మహిళల మధ్య లైంగిక బంధం ఆత్మహత్యకు దారితీసింది. భర్తకు దూరంగా వున్న వివాహిత (23 ఏళ్ళు), 20 ఏళ్ల మరో యువతికి మధ్య ఏర్పడిన స్నేహం.. లైంగిక బంధానికి దారితీసింది. అయితే వీరి బంధాన్ని తప్పుబట్టిన పెద్దలు యువతికి వివాహం చేయాలనుకున్నారు. కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదో ఏమో కానీ.. వివాహితతో పాటు యువతి కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని నామక్కల్ పట్టణంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 23 ఏళ్ల ఓ వివాహిత, మరో 20 ఏళ్ల యువతి పెరియమనాలిలోని ఓ మగ్గం పరిశ్రమలో కొన్ని నెలలుగా పనిచేస్తున్నారు. ఇద్దరికి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం కాస్తా లైంగిక బంధానికి దారితీసింది. లెస్బియన్స్‌గా వీరు మారిపోయారు. ఈ వ్యవహారం ఆ పరిశ్రమలో తెలియడంతో ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
 
వివాహిత భర్తతో మనస్పర్థలు రావడంతో అతనికి దూరంగా ఉంటోంది. ఆమెకు రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఆ యువతి కొట్టపాలయం ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుస్తుండేవారు. వీరి బంధం గురించి యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో వివాహితతో దూరంగా ఉండాలని ఆమెను హెచ్చరించారు.
 
అంతేకాదు, రాశిపురానికి చెందిన వ్యక్తితో యువతికి మే 27న పెళ్లి చేయాలని నిర్ణయించారు. గత శనివారం, యువతి ఆ వివాహిత ఇంటికి వెళ్లింది. అక్కడే యువతులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. ఇంకా ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం