Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగవ్వ 10వారాల పాటు హౌస్‌లో వుంటుంది.. కౌశల్ మద్దతు

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (10:44 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే హౌస్‌లో గొడవలు, టాస్కులతో సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ ప్రారంభం కాకముందే.. గంగవ్వ హవా మొదలైంది. ఆమె పేరుతో ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ ఆర్మీ కూడా సిద్ధమైంది. ఆమెకు సపోర్ట్ చేయాలంటూ పోస్టులు కూడా దర్శనం ఇస్తున్నాయి. ఇదే సమయంలో బిగ్‌బాస్2 విన్నర్ కౌశల్ తన మద్దతు ప్రకటించాడు. ఆమె కచ్చితంగా 10 వారాలు ఉంటుందని చెప్పారు. మిగితా కంటెస్టెంట్లు ఎవరూ ప్రతిభ చూపించడం లేదనే వాదనకు కూడా తెరపైకి తెచ్చాడు. దీంతో ఆమెకు మరింత మద్దతు పెరిగిపోయింది.
 
గంగవ్వకు మద్దతు ఇస్తూనే కౌశల్ కీలక వ్యాఖ్య చేశారు. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు ఉపాధిని కోల్పోయిన సెలబ్రిటీలు, తిరిగి ఉపాధిని వెతుక్కునే పనిలో భాగంగానే హౌస్‌లోకి మంచి కంటెస్టెంట్లు వెళ్లలేదని అన్నారు. అయితే పోటీదారుల ప్రతిభపై ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. 
 
అయితే ఓ పల్లెటూరు బామ్మను ఎంపిక చేయడం ద్వారా షోకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఆధరణ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆమె కనీసం 10 వారాల పాటు హౌస్ లో కొనసాగుతారని భావిస్తున్నానని చెప్పారు. ఫైనల్‌కు రావాలంటే ఫిజికల్ టాస్కులే ముఖ్యం కాదని పేర్కొన్నారు.
 
అత్యంత సామాన్య కుటుంబం, గ్రామీణ నేపథ్యం ఉన్న గంగవ్వ ధైర్యాన్ని, ఆమె ప్రవర్తనను చూస్తే ముచ్చటేస్తుంది. వయసును అధిగమించి ఆమె చూపిస్తున్న ఉత్సాహాన్ని అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను. ఎంటర్‌టైన్ ఇండస్ట్రీ సంప్రదాయాలను బ్రేక్ చేసి అందరికీ ఓ స్ఫూర్తిగా నిలుస్తున్నారని గంగవ్వపై కౌశల్ ప్రశంసల వర్షం కురిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దివ్వెల మాధురి నోట్లో దువ్వాడ శ్రీనివాస్ సమోసా (video)

మై హోమ్ లడ్డూ.. రూ.51,77,777లకు వేలం- గణేష్ అనే వ్యక్తికి సొంతం

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments