నితిన్‌కు రాజ‌మౌళి మిత్రుడు హిట్ ఇస్తాడా!

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (10:58 IST)
ChadraSeka, Rajamouli, Nitin
నితిన్ ఇప్పుడు ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి నేతృత్వంలో `చెక్‌` చేశాడు. యేలేటి, రాజ‌మౌళి ఇద్ద‌రూ మంచి స్నేహితులు. చాలామందికి దూర‌పు బంధుత్వం వుంద‌నుకుంటారు.  వీరిద్ద‌రు సినీ ప్ర‌స్తానం ఒకేసారి జ‌రిగింది. ఇదివ‌ర‌కు యేలేటి ప‌బ్లిసిటీకి దూరంగా వుండేవాడు. ఆవిష‌యంలో రాజ‌మౌళిని ఫాలో అయ్యేవాడు. కానీ ప‌రిస్థితులు మారాక కొన్ని ప్లాప్‌లు వ‌చ్చాక తాను ఏమి చెశానో తెలుసుకున్నాక ఆయ‌న ఐడియా మారింది. ఇక‌పోతే నితిన్‌తో సినిమా చేయ‌డం అనేది మూడేళ్ళ కింద‌టి ముచ్చ‌ట‌. అప్పుడు చెప్పిన క‌థ‌ను కాలానుగుణంగా మార్పులు చేసుకుని తెర‌కెక్కించాడు యేలేటి. నితిన్‌తో 2004లో రాజ‌మౌళి `సై` అంటూ ర‌బ్బీ గేమ్‌ను తెర‌కెక్కించాడు. అది హిట్ అయింది. 2020లో యేలేటి సినిమా చేస్తున్న‌ప్పుడు క‌థ, క‌థ‌నం గురించి రాజ‌మౌళికి చెప్పాడ‌ట‌. అందుకు కొన్ని మార్పులుకూడా ఇచ్చాడ‌ని తెలిసింది. ఇద్ద‌రూ మేథావులైన ద‌ర్శ‌కులుగా పేరుంది. నితిన్‌తో సై హిట్ ఇచ్చాడు కాబట్టి తాను చెస్ నేప‌థ్యంలో వ‌చ్చే చెక్‌తో త‌ప్ప‌కుండా హిట్ ఇస్తానంటూ యేలేటి ధీమా వ్య‌క్తం చేస్తున్నాడు. అందుకు  క‌థ‌లో బ‌ల‌మైన అంశంతోపాటు క‌థ‌నం ఆస‌క్తిక‌రంగా వుంటుంద‌ని చెబుతున్నారు.
 
ఇక రాజ‌మౌళి, త‌న స్నేహితుడు చెక్‌ను ప్ర‌మోట్ చేయ‌డానికి ముందుకొచ్చాడు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజ‌రై `ఈ మ‌ధ్య కాలంలో ఒక టీజ‌ర్ చూసి ఎప్పుడెప్పుడు థియేటరుకెళ్లి సినిమా చూద్దామా అనిపించింది చెక్ విష‌యంలోనే` అని చెప్పాడు. టీజ‌ర్ అంత ఆస‌క్తిక‌రంగా, కొత్త‌గా అనిపించింద‌ని రాజ‌మౌళి అభిప్రాయ‌ప‌డ్డాడు. తెలుగులో మాస్, క్లాస్ సినిమాలు అనే తేడాలు త‌గ్గాయ‌ని.. ఐతే చెక్ సినిమాతో ఈ గీత పూర్తిగా చెరిగిపోతుంద‌ని తాను న‌మ్ముతున్నాన‌ని చెప్పాడు. నితిన్ ఒక‌ప్పుడు ఒక ప‌రిధిలో ఉండి ఇలాంటి సినిమాలే చేస్తాడు అనే ముద్ర వేసుకున్నాడ‌ని, అలాంటి ద‌శ నుంచి త‌న‌ను తాను కొత్త‌గా మ‌లుచుకుని విభిన్న‌మైన సినిమాల‌తో ప్ర‌యాణం సాగిస్తున్నాడ‌ని కితాబిచ్చాడు.  రాజ‌మౌళి అంత‌టివాడే త‌న సినిమా గురించి మాట్లాడ‌డం ప‌ట్ల నితిన్ ఆనంద‌ప‌డిపోయాడు. ఇక చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి మాత్రం మ‌రింత న‌మ్మ‌కంతో చెక్ సినిమా త‌ప్ప‌క హిట్ అవుతుంద‌ని రాజ‌మౌళితో అంటున్నాడు. ఈ సినిమా హిట్ అయితే చాలాకాలం స‌క్సెస్‌కోసం చూస్తున్న యేలేటికి మ‌రో ఆరంభం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments