Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌నే బుల్ షిట్ అంటూ రంకెలేసిన పునర్నవి మళ్లీ ఎంటరవుతుందా?

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (19:40 IST)
పునర్నవి మొన్న ఆదివారం నాడు ఎలిమినేట్ అయ్యింది. అంతకుముందు శృంగార రసంతో బిగ్ బాస్ ఇంట్లో అందరి మదిని దోచుకున్న పునర్నవి గేమ్‌లో చాలానే చేసింది. ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అనే హారిబుల్ టాస్కు సమయంలో తోటి ఇంటి సభ్యులు బాబా భాస్కర్, హిమజ, రాహుల్, శిల్ప, వితికాలు దెయ్యాలుగా మారి ఇంటి సభ్యులైన రవి, పునర్నవి, వరుణ్, శివజ్యోతి, శ్రీముఖి, మహేష్‌లను వేధించే క్రమంలో పునర్నవి మండిపడింది. 
 
ఆటలో ఒక్కో కంటెస్టెంట్‌ని దెయ్యాలు చంపుకుంటూ పోతుంటాయి. చనిపోయినవారు మళ్లీ దెయ్యాలవుతారు. ఆ క్రమంలో పునర్నవిని స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తే ఆమె చనిపోతుందని, తద్వారా శిల్ప మనిషిగా మారుతుందని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో శిల్ప మిగతా దెయ్యాలతో కలిసి పునర్నవిని స్విమ్మింగ్ పూల్‌లోకి ఈడ్చికెళ్లి పడేసింది. ఈ క్రమంలో తన పట్ల శిల్ప కటువుగా ప్రవర్తించిందనీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఇదేం బుల్ షిట్ గేమ్ బిగ్ బాస్, నీ ఆట నువ్వే ఆడుకో.. అంటూ బిగ్ బాస్‌కే క్లాస్ పీకింది. అప్పట్లో ఇది వైరల్ అయ్యింది.
 
ఇకపోతే ఇప్పుడు పునర్నవి ఎలిమినేటై బయటకు వచ్చేసింది. పున్ను ఎలిమినేట్ కావడంపై హిమజ ఎంతో ఖుషీగా మారిపోయింది. తనకు చాలా సంతోషంగా వుందంటూ టీవీ ముందు చిందులు వేసింది. ఐతే పునర్నవి ఇంటి నుంచి ఎలిమినేట్ కాగానే పాపం రాహుల్ తెగ ఏడ్చేశాడు. మొత్తమీద పునర్నవి పాపులారిటీ ఓ రేంజిలో వున్నట్లు బిగ్ బాస్‌కు అర్థమయిందనీ, అందువల్ల మళ్లీ ఆమెను బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశపెడతారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే అప్పుడు హిమజ ఏం చేస్తుందో?

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments