బిగ్ బాస్ ఇంటి నుంచి అలీ ఎలిమినేట్... శ్రీముఖి-జ్యోతి కన్నీటి పర్యంతం... అంత అటాచ్మెంట్ ఏంటో?

సోమవారం, 9 సెప్టెంబరు 2019 (16:21 IST)
శ్రీముఖి, రాహుల్, మహేష్, రవి కృష్ణ, అలీ ఏడవ వారానికి బిగ్ బాస్ ఇంట్లో ఎలిమినేట్ అయ్యేందుకు నామినేట్ అయ్యారు. వీరిలో శ్రీముఖి లేదంటే రాహుల్ ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా శనివారం నాటి ఎపిసోడ్లో రాహుల్ సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు. ఈ ప్రకటనతో బిగ్ బాస్ ఇంట్లో చాలామంది సంతోషంగా ఉన్నప్పటికీ, శ్రీముఖి పూర్తిగా అసంతృప్తిగా నిరాశ చెందింది.
 
ఎందుకంటే ప్రతి వారంలోనూ రాహుల్‌నే నిరంతరం నామినేట్ చేస్తున్నది శ్రీముఖి. రాహుల్‌పై వీలైనప్పుడల్లా ఆమె ఫిర్యాదులు కూడా చేస్తోంది. ఆదివారం ఎలిమినేట్లో ఖచ్చితంగా రాహుల్ ఎగ్జిట్ డోర్ తీసుకుంటారని ఆమె భావించింది కానీ అతను సురక్షితంగా బిగ్ బాస్ ఇంట్లో వున్నాడని చెప్పగానే అసంతృప్తిగా ముఖం పెట్టింది.
 
మరోవైపు, రాహుల్ క్షేమంగా ఉన్నందుకు వరుణ్, పునర్నవి, వితిక చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఆదివారం నాటి ఎపిసోడ్... అంటే 50వ రోజు బిగ్ బాస్ ఇంటి నుంచి అనూహ్యంగా అలీని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. దీనితో శ్రీముఖి, జ్యోతి కన్నీటి పర్యంతమయ్యారు. ఎపిసోడ్ ముగిసేవరకూ ఏడుస్తూనే వున్నారు. మరి అంత అటాచ్మెంట్ ఏంటోనని బిగ్ బాస్ చూస్తున్నవారు చెప్పుకుంటున్నారు. మరి ఇంటి నుంచి బయటకు వచ్చాక వీరేమైనా చెపుతారేమో?

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మెగాస్టార్ సైరా ప్లాన్స్ ఏంటో తెలుసా..?