Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీల్ సరసన రంగమ్మత్త.. కాంబో అదిరిపోతుందిగా..!?

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (20:49 IST)
కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో సునీల్ ముందుంటాడు. దశాబ్ధాలుగా హాస్యనటుడిగా, ఆపై హీరోగా మారిన సునీల్ ప్రస్తుతం మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. రాజమౌళి సినిమా 'మర్యాద రామన్న' సినిమాతో హీరోగా భారీ హిట్ అందుకున్న సునీల్ తరువాత హిట్ అన్న పేరుకు ఆమడ దూరంలో ఉన్నాడు. దాంతో మళ్లీ కమెడియన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. 
 
అయినప్పటికీ హీరోగా చేసేందుకు అడపతడప అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా ఇటీవల సునీల్‌కి హీరో అవకాశం వచ్చింది. ఇటీవల సీ చంద్రమోహన్ దర్శకత్వంలో హీరోగా చేసేందుకు సునీల్ ఓకే చెప్పాడు. దీనికి 'వేదాంతం రాఘవయ్య' అనే పేరును ఫిక్స్ చేశారు. 
 
ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాలో సునీల్ సరసన జబర్దస్త్ ఫేమ్ అనసూయను ఎంపిక చేయనున్నారట. ఇప్పటికే రంగమ్మత్తను చిత్రయూనిట్ సంప్రదించిందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో చేసేందుకు రంగమ్మత్త ఓకే చెప్పిందట. సునీల్, అనసూయ అంటే చాలా క్రేజీ కాంబో అని అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments