Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఖ‌రికి మ‌హేష్‌.. వెంకీని న‌మ్ముకున్నాడు... నిజం ఒప్పుకున్నాడు..!

Webdunia
గురువారం, 2 మే 2019 (22:31 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా మే 9న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే... మే నెల‌లో రిలీజైన మ‌హేష్ సినిమాలు నిజం, నాని, బ్ర‌హ్మోత్సవం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అందుచేత మే నెల త‌న‌కు అస‌లు క‌లిసి రాలేద‌ని మ‌హేష్ బాబుకి బాగా తెలుసు. 
 
అందుకే మే నెల‌లో సినిమా రిలీజ్ అంటే మ‌హేష్ బాబుకి భ‌యం. అందుక‌నే మ‌హ‌ర్షి సినిమాని ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయ‌డానికి చాలా ట్రై చేసారు కానీ... కుద‌ర‌లేదు. మే నెల‌లో రిలీజ్ చేయాల్సిన ప‌రిస్థితి. ఈ చిత్ర నిర్మాత‌లైన దిల్ రాజు, అశ్వ‌నీద‌త్‌ల‌కు మే నెల బాగా క‌లిసి వ‌చ్చినా... త‌న‌కు క‌లిసొస్తుందో లేదో అని ఎక్క‌డో భ‌యం. అందుక‌నే మ‌హేష్ కొత్త సెంటిమెంట్‌ను నమ్ముకున్నాడు. ఆ సెంటిమెంటే వెంకీ.
 
అక్కినేని నాగ చైత‌న్య - స‌మంత అక్కినేని జంట‌గా న‌టించిన మ‌జిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ మూవీ 40 కోట్లు షేర్, 60 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ట్ చేసి బ్లాక్‌బ‌ష్ట‌ర్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. నాని హీరోగా మ‌ళ్లీ రావా ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం జెర్సీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ మూవీ కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. 
 
అందుక‌నే మ‌హేష్ ఈ ఈవెంట్‌కి వెంకీని సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని పిలిచార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌హేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్ప‌డం విశేషం. ఈ సెంటిమెంట్ ప్ర‌కారం మ‌హ‌ర్షి కూడా స‌క్సస్ సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments