Webdunia - Bharat's app for daily news and videos

Install App

సవతి తల్లి తీరు ఎందుకు? ఏపీ చేసిన తప్పేంటి? మోడీపై మోహన్‌బాబు ట్వీట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు విస్మరించినందుకు నిరసనగా టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (19:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు విస్మరించినందుకు నిరసనగా టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మోసంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది ప్రముఖులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఇప్పటికే సినీ దర్శకుడు కొరటాల శివ గురువారం ఉదయం చేసిన ట్వీట్‌లో.. ప్రధాని నరేంద్ర మోడీని మనిషిగా మార్చుదాం అంటూ పిలుపునిచ్చారు. అలాగే, సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. 
 
ఏపీపై సవ‌తి త‌ల్లి తీరు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. 'ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో స‌వ‌తిత‌ల్లిలా వ్య‌వ‌హ‌రిస్తున్నారెందుకు? ఆ రాష్ట్రం చేసిన త‌ప్పేంటి? ప్ర‌త్యేక హోదాపై ఏమి జ‌రుగుతోంది? ఏపీకి ప్ర‌త్యేక హోదా రావాల‌ని తెలంగాణ కూడా కోరుకుంటోంది. ఇది ఏపీ సెంటిమెంట్ మాత్ర‌మే అనుకుంటున్నారా?' అంటూ మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments