Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ కారు అమ్మింది ఎందుకో తెలుసా? తెలిస్తే సలాం కొడతారు..

శ్రీజ అనే క్యాన్సర్ బారిన పడిన బాలికను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రక్షించిన సంగతి తెలిసిందే. ఆమె వైద్య ఖర్చులు భరించిన పవన్ కల్యాణ్ ఆమెను మనిషి చేశాడు. అలాంటి వ్యక్తి తాజాగా తన వద్ద నున్న జి55 మెర్సిడ

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (13:30 IST)
శ్రీజ అనే క్యాన్సర్ బారిన పడిన బాలికను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రక్షించిన సంగతి తెలిసిందే. ఆమె వైద్య ఖర్చులు భరించిన పవన్ కల్యాణ్ ఆమెను మనిషి చేశాడు. అలాంటి వ్యక్తి తాజాగా తన వద్ద నున్న జి55 మెర్సిడెజ్ బెంజ్ కారును అమ్మేశాడు. అయితే ఈ కారును అమ్మాల్సిన పరిస్థితి పవన్‌కు ఎందుకొచ్చింది. తాను ఎంతగానో ఇష్టపడి కొనుకున్న కారును పవన్ అమ్మేశాడంటే.. ఆయనకు ఎంత కష్టమొచ్చిందని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. 
 
కానీ పవన్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమేనని సన్నిహితులు అంటున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్‌కు నిర్మాతలలో ఒకరిగా వ్యవహరించిన పవన్ కల్యాణ్‌కు భారీ నష్టాలే వచ్చాయి. కానీ పవన్ ఓ మంచి పని కోసమే తన కారును అమ్మేశాడని వార్తలు వస్తున్నాయి. ఒకానొక సందర్భంలో గుండెజబ్బులతో బాధ పడుతున్న చిన్నారులకు ఆపరేషన్ చేయిస్తానని మాటిచ్చిన పవన్ కల్యాణ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం, చేతిలో క్యాష్ లేకపోవడంతో ఆయన తన కారును అమ్మి చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించాడట. 
 
దాంతో పాటు త్వరలో తాను రాజకీయాల్లో బిజీ కానుండటంతో ఆయన కారును అమ్మి చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారని తెలిసింది. ఖరీదైన వస్తువులు తనను ప్రజల నుంచి దూరం చేస్తాయనే ఉద్దేశంతో కారును అమ్మేసినట్లు తెలిసింది. అదే గనక నిజమైతే పవన్ కల్యాణ్‌కు సలాం కొట్టాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments