Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్య సినిమాలో మోహ‌న్ బాబు న‌టించ‌డానికి అస‌లు కార‌ణం ఇదే..!

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (14:53 IST)
క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు... ఇటీవ‌ల కాలంలో సినిమాల్లో న‌టించ‌డం బాగా త‌గ్గించేసారు. క‌థ బాగుంది... త‌న పాత్ర బాగుంది అని న‌మ్మితేనే త‌ప్ప అస‌లు సినిమాల్లో న‌టించేందుకు ఒప్పుకోవ‌డం లేదు. ఇటీవ‌ల మ‌హాన‌టి సినిమాలో న‌టించారు. అది ఎస్వీఆర్ పాత్ర కాబ‌ట్టి. ఇలాంటిది మోహ‌న్ బాబు సూర్య సినిమాలో న‌టిస్తున్నాడు అని ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేస‌రికి ఇది నిజ‌మా..? కాదా..? అని కాస్త డౌట్ ప‌డ్డారు. 
 
తీరా ఆరా తీస్తే... నిజ‌మే అని తెలిసింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. బాక్సింగ్‌ నేపథ్యంలో హిందీలో ‘సాలా కదూస్‌’, తమిళంలో ‘ఇరుది సుట్రు’ పేరుతో సుధ కొంగర దర్శకత్వం వహించిన చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిన విషయం తెలిసిందే. ఇరుది సుట్రు చిత్రాన్ని తెలుగులో ‘గురు’ పేరుతో సుధ కొంగర తెరకెక్కించారు. ఇప్పుడు సూర్య హీరోగా ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ‘సూరరై పోట్రు’. ఈ చిత్రాన్ని సూర్య నిర్మిస్తుండ‌డం విశేషం.
 
అయితే.. ఇందులో కథను మ‌లుపు తిప్పే అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్రకు మోహన్‌బాబు అయితే క‌రెక్ట్‌గా స‌రిపోతార‌ని భావించి ఆయన్ను అప్రోచ్‌ అయ్యారట‌ చిత్ర యూనిట్‌. ఈ చిత్ర కథ, ఇందులో ఆయ‌న‌ పాత్ర నచ్చి న‌టించేందుకు మోహ‌న్ బాబు అంగీకరించారట‌. దీని వెన‌కున్న అస‌లు కార‌ణం ఏంటంటే... మంచు ల‌క్ష్మి ఇటీవ‌ల సూర్య భార్య జ్యోతిక‌తో క‌లిసి ఓ సినిమా చేసారు. అప్పుడు వీరిద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఏర్ప‌డింది. ఆవిధంగా సూర్య సినిమాలో న‌టించేందుకు మంచు ల‌క్ష్మీని కాంటాక్ట్ చేసార‌ట. 
 
కూతురు చెప్ప‌డంతో మోహ‌న్ బాబు వెంట‌నే ఓకే అన్నార‌ట. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనడానికి గురువారం మోహన్‌బాబు చెన్నై వెళ్లారు. శుక్రవారం నుంచి ఆయ‌న‌ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరిగే షూటింగ్‌లో పాల్గొంటార‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments