రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు సినీపరిశ్రమలో తక్కువ కాలంలో అగ్రహీరోయిన్‌గా ఎదిగారు. "నాన్నకు ప్రేమతో" సినిమాలో బొద్దుగా, అందంగా కనిపించిన ఈ భామ ఆ తర్వాత "రారండోయ్ వేడుక చూద్దాం" సినిమాతో జీరో సైజ్‌తో మరిం
రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు సినీపరిశ్రమలో తక్కువ కాలంలో అగ్రహీరోయిన్‌గా ఎదిగారు. "నాన్నకు ప్రేమతో" సినిమాలో బొద్దుగా, అందంగా కనిపించిన ఈ భామ ఆ తర్వాత "రారండోయ్ వేడుక చూద్దాం" సినిమాతో జీరో సైజ్‌తో మరింత స్లిమ్ అయ్యింది. రకుల్ ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా రకుల్‌కి అభిమానులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. రకుల్ చేతిలో సినిమాలు కూడా పెద్దగా లేవు. కేవలం మహేష్ బాబుతో "స్పైడర్" సినిమాలో మాత్రమే నటిస్తున్నారు. ఆ తర్వాత పెద్దగా కాల్ షీట్లు లేవు. కారణం.. రకుల్ ప్రీత్ సింగ్ అందాలను ఆరబోయదని దర్శక, నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చేశారు.
అందుకే చాలా సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగ్‌ను నటించాలని, అందులోనూ పొట్టి డ్రస్సులతో నటించాలని దర్శకులు చెప్పారట. అయితే రకుల్ మాత్రం ముఖం మీద చెప్పినట్లు దర్శకులకు ఒకే మాట చెప్పేసిందట. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాతో లంగా, ఓనీ కట్టి అచ్చమైన తెలుగు అమ్మాయిలా.. నిండు తనంతో కనిపించాను.
శరీరం పూర్తిగా కప్పుకునే దుస్తులు వేసుకుంటాను. స్లీవ్ లెస్ డ్రస్సులు, తొడలు కనిపించేలా డ్రస్సులు ఇక వేయనని తేల్చేసిందట ఈ భామ. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలో హద్దు మీరి నటించడం వల్ల ఆమె కుటుంబ సభ్యులు క్లాస్ పెరికారట. అప్పటి నుంచి ఈ భామ అలా నటించడం మానేసిందట. ఇప్పుడున్న సినిమాల్లో అందాలు ఆరబోస్తే తప్ప సినిమా అవకాశాలు రాదనేది అందరికీ తెలిసిందే.