హీరో పవన్ కళ్యాణ్ ఓ మామ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను ఎక్కడ ఉన్నారోనని ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఈ మామ వ్యవహారం ఏంటనే కదా మీ సందేహం. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ చ
హీరో పవన్ కళ్యాణ్ ఓ మామ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను ఎక్కడ ఉన్నారోనని ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఈ మామ వ్యవహారం ఏంటనే కదా మీ సందేహం. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో మామ పాత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు చెన్నై, ముంబై, కొచ్చిలకు మనుషుల్ని పంపించి మామ కోసం గాలిస్తున్నారు. ఈ సినిమాలో హీరోకు మామ వరసయ్యే ఆ పాత్రకు ఎవరు సూటవుతారోనని త్రివిక్రమ్ అండ్ కో తెగ వెతుకుతున్నారట.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళ నటుల పేర్లను త్రివిక్రమ్‌కు కాస్టింగ్ డైరెక్టర్స్ చెబుతున్నారట. ఆయన మనసులో మాత్రం మమ్ముట్టి అయితే బాగుంటుందని అనుకుంటున్నారని సమాచారం. కాగా, ఈ చిత్రంలో పవన్‌కు ఖూష్బూ అత్తగా నటిస్తున్నారనే ప్రచారం తెలిసిందే. అత్త భర్తే ఈ మామ.