Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహో ద‌ర్శ‌కుడు సుజిత్‌కు మ‌ళ్ళీ ఎందుకు అవ‌కాశం రాలేదు!

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (16:48 IST)
Prabhas, Sujit
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో 2019లో సాహో చిత్రం చేశాక ఒక్క‌సారిగా ద‌ర్శ‌కుడు సుజిత్ పేరు అంద‌రికీ తెలిసింది. శ‌ర్వానంద్‌తో ర‌న్ రాజా రన్ చిత్రం త‌ర్వాత ఆయ‌న‌కు ప్ర‌భాస్‌తో వ‌చ్చిన అవ‌కాశం అది. ఆ సినిమా త‌ర్వాత సుజిత్ కెరీర్ ఎక్క‌డికో వెళ్ళిపోతుంద‌నే అనుకుంది టాలీవుడ్‌. సాహో సినిమాను బాలీవుడ్‌ను కూడా ఆక‌ర్షించింది. బాలీవుడ్ స్టార్‌లు కూడా న‌టించారు.  ఆ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది.
 
టెక్నిక‌ల్‌గా మంచి పేరు తెచ్చుకున్న సాహోకు చిరంజీవి అభినంద‌లు ద‌క్కాయి. ఆ త‌ర్వాత చిరంజీవితో సినిమా చేయాల‌నేది ప్లాన్‌. అందుకు రంగం సిద్ధ‌మైంది కూడా. మ‌ల‌యాళ‌సినిమా లూసిఫ‌ర్  ను రీమేక్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులుకు సుజిత్ సిద్ధం అయ్యాడు. కానీ కొన్ని కారణాల వ‌ల్ల ఆ చిత్రానికి వినాయ‌క్ లైన్‌లోకి వ‌చ్చాడు. దాంతో స్క్రిప్ట్ ద‌శ‌లోనే సుజిత్ త‌ప్పుకున్నాడు. ఆ త‌ర్వాత చిరంజీవి వ‌ర‌స‌పెట్టి నాలుగు సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. కానీ సుజిత్‌కు అవ‌కాశం మాత్రం అందులో ఏ ఒక్క సినిమాకూ రాలేదు. 
 
అంత‌ర్లీనంగా కొంత‌మంది పోక‌డ‌వ‌ల్ల చిరంజీవి సినిమాలో త‌ను త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. పెద్ద హీరోల‌కు కాంబినేష‌న్‌లు నిర్మాత‌లు చూస్తుంటారు. సాహో గొప్ప సినిమా అయినా అది క‌మ‌ర్షియ‌ల్‌గా అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేద‌నీ టాక్ కూడా వుంది. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ తో మ‌రో సినిమా చేయ‌డానికి సుజిత్ ఓ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. మ‌రి అది ఎప్పుడు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments