Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘ఇడియట్’ చూసి సినిమాల్లోకి రావాలనుకున్నాః సుజిత్ రెడ్డి

‘ఇడియట్’ చూసి సినిమాల్లోకి రావాలనుకున్నాః సుజిత్ రెడ్డి
, గురువారం, 19 ఆగస్టు 2021 (17:21 IST)
Sujit Reddy
`నేను 100 మీటర్ల పరుగు పందెంలో స్టేట్ గోల్డ్ మెడలిస్ట్ ని. అథ్లెటిక్స్ అంటే చాలా ఇష్టం. అయితే బి.టెక్.లో చేరడం వల్ల ఆ కాలేజీలో అథ్లెటిక్స్ కి పెద్ద ఎంకరేజ్ వుండేది కాదు. దాంతో నేను బి.టెక్.పూర్తయిన తరువాత సినిమాల్లోకి రావాలని ప్రయత్నాలు చేశా. నేను రవితేజకి డైహార్డ్ ఫ్యాన్ ని. ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎలా వుంటాయో మనందరికీ తెలుసు. ఆయన ‘ఇడియట్’ సినిమాను చూసి సినిమాల్లోకి రావాలనుకున్నా. మా మావయ్య కమెడియన్ శ్రీనివాసరెడ్డి నీవే స్వతహాగా సినిమాల్లో రాణించాలనేవారు. దాంతో దాదాపు 8 ఏళ్లు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా`అంటూ త‌న స్వ‌గ‌తాన్ని నెమ‌రేసుకున్నారు వ‌ర్ధ‌మాన క‌థానాయ‌కుడు సుజిత్ రెడ్డి.
 
చేరువైన... దూరమైన’ సినిమాతో హీరోగా ప‌రిర‌యం అవుతున్నాడు. వినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో సుజిత్ రెడ్డి ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.
 
- మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వచ్చేవి. అయితే నాకు మాత్రం హీరోగానే లాంఛ్ అవ్వాలని వుండేది. శ్రీనివాసరెడ్డి గారి సినిమా ‘భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు’లో ఓ చిన్న రోల్ తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ఆ తరువాత మళ్లీ అలాంటి పాత్రలు చేయనని చెప్పేశా.
 
-  హీరోగా నటించాలని ఆఫీసుల చుట్టూ తిరిగేవాణ్ని. చాలా మంది మీ మామ‌య్య అనుకుంటే చాలామంది ముందుకు వ‌స్తారు అన్నారు. కానీ నేనే సొంతంగా రాణించాలని అనుకున్నా.  ఆ స‌మ‌యంలో చంద్రశేఖర్ కానూరి పరిచయం అయ్యారు.  మీరు హీరో కావాలి అంటే బాగా స్లిమ్ అవ్వాలి అన్నారు. నేను బాగా ఫ్యాట్ గా వుండేవాణ్ని. దాంతో పది కిలోలు తగ్గి స్లిమ్ అయ్యా. ఫస్ట్ నా మీద ఓ ట్రయల్ షూట్ చేశారు. దాన్ని మామయ్యకు చూపించగానే బాగా చేశావని మెచ్చుకున్నారు. ఆ తరువాత ఈ సినిమా కథ విని సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే  అన్నారు.  
 
- నేను రోహన్ తనేజా అనే ఓ ముంబాయి బేస్డ్ ఇన్ స్టిట్యూట్ లో నటనపై శిక్షణ తీసుకున్నా. అక్కడ పెద్దగా నేర్చుకుంది ఏమీ లేదు. ఆ తరువాత నేనే స్వతహాగా అద్దంలో చూసుకుంటూ, నాకు నేనే నటనను మెరుగు పరుచుకున్నా.
 
- నాకు యాక్షన్ సీన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అదే నా బలం. ఈ చిత్రంలో క్లైమాక్స్ ప్రధానం. మొదట్లో చాలా మంది క్లైమాక్స్ సీన్ పై సందేహాలు వచ్చాయి. మొదటి సినిమాలోనే అంత బరువైన క్లైమాక్స్ ఎందుకని అందరూ అన్నారు. కానీ దర్శకుడు పట్టుబట్టి చేయించారు. చాలా బాగా వచ్చింది. దర్శకుడు చంద్రశేఖర్ కానూరి ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి శిష్యుడు. ఆయన మొదటి సినిమా ‘రథం’ చేశారు. ఇప్పుడు నాతో చేశారు. 
 
-  ఇందులో తమిళ నటుడు శశి ప్రతినాయకుడుగా చాలా బాగా చేశాడు. హీరోయిన్ తరుణితో కలిసి టామ్ అండ్ జెర్రీలాగ పోటీ పడి చేశాం. మిగతా పాత్రల్లో దర్శకుడు దేవీప్రసాద్, రాజేశ్వరీ నాయర్, హీరోయిన్ అమ్మ పాత్రలో మణిచందన, బ్రదర్ పాత్రలో తమిళ నటుడు శశి నటించారు. సీనియర్ నటుడు బెనర్జీ కూడా చేశారు.
-  ఈ చిత్రం టీజర్, ట్రైల‌ర్‌ను పెద్ద  డైరెక్టర్లు ఆవిష్క‌రించ‌డంతో వారి ఆశీర్వాదం కూడా ల‌భించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్పు బస్తాలు లేకపోతే కాలో, చేయ్యో విరిగేదిః సంపూర్ణేష్ బాబు