Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రూస్‌లీని చూశాక‌ మగాడ్ని అయిన నాకే పిచ్చెక్కింది- రామ్ గోపాల్ వర్మ

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (18:02 IST)
Ram Gopal Varma
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లడ్కీ’(తెలుగులో ‘అమ్మాయి‘) చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించి ఈ చిత్రం జూలై 15వ తేదీన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, చైనా భాషల్లో విడుదల అవుతుంది. ఈ క్రమంలో సినిమా విశేషాలను ఆర్జీవీ మీడియాతో  పంచుకున్నారు.
 
మొట్టమొదటి మార్షల్ ఆర్ట్స్ చిత్రమని మీరు అంటున్నారు?.. ఇంత వరకు ఈ జానర్‌లో ఎవరూ కూడా సినిమాను తీయకపోడానికి కారణం ఏమైనా ఉందా?* 
మార్షల్ ఆర్ట్స్ అనేది ఫైట్స్. మన వాళ్లు మార్షల్ ఆర్ట్స్ పేరుతో వైర్స్, వీఎఫ్‌ఎక్స్, డూప్స్, ఎడిట్‌లు చేసి మానిప్యులేట్ చేస్తారు. నేను అలాంటివీ ఏమీ చేయలేదు. నిజంగా ఆ అమ్మాయి ఏం చేయగలదో అది చేయించాను. బ్రూస్‌లీ కూడా అంతే.. తాను ఏం చేయగలడో అదే ఫైట్.  సినిమాటిక్‌గా ఉండదు. అందుకే నేను ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ సినిమా అని అన్నాను. మనవాళ్లు చేసేది స్టంట్స్. మనుషుల్ని మామూలుగా కొట్టడానికి ట్రైనింగ్ తీసుకుని కొట్టడానికి తేడా అదే.
 
మీరు ముందు నుంచి కూడా ఈ వైర్ వర్క్స్, వీఎఫ్‌ఎక్స్ పనులకు వ్యతిరేకమా?
 
అవును. నేను నా రియల్ లైఫ్‌లో ఫైట్స్ చూసినప్పుడు కొడితే.. అక్కడే పడతాడు. కానీ సినిమాలో పది అడుగుల దూరం పడతాడు. ఆ తరువాత ఒక్కడే పడితే ఏం బాగుంటుందని అందరినీ పడేసేవారు. కొంత మంది మరీ పది అడుగులు ఎందుకు అని ఐదు అడుగుల దూరం పెట్టుకునేవారు. చేస్తే  అదైనా చేయాలి.. ఇదైనా చేయాలి. మధ్యలో ఉండకూడదు.
 
*శివ’ సమయంలోనూ అలానే స్టిక్ అయి ఉన్నారా? నాగార్జున గారు ఏమన్నారు?
శివ సమయంలో చేసిన ఫైట్స్‌కు రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. అక్కడ ఫైట్స్‌లో నాగార్జున ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌ను బట్టి నిజంగా కొట్టిన ఫీలింగ్ వచ్చేది. కానీ అమ్మాయి చిత్రంలో మాత్రం రిస్క్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడి దూకి, గాల్లోకి ఎగిరి తన్నడం వంటి యాక్షన్స్ ఉంటాయి. ఇక పెద్ద హీరోలు, నిర్మాతలు ఇలాంటి రిస్క్‌లు తీసుకోలేరు.  ఈ అమ్మాయి ఎన్నో ఏళ్ల నుంచి ట్రైనింగ్ తీసుకుంటోంది. అందుకే ఆమెకు తన బాడీ మీద కంట్రోల్ ఉంది.
 
మీరు సినిమాను చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తుంటారు కదా? ఈ సినిమాను ఎన్ని రోజుల్లో  పూర్తి చేశారు?
 
ఈ సినిమాకు 60 నుంచి 70 రోజులు పట్టింది.
 
ఇందులో మార్షల్ ఆర్ట్స్ కాకుండా ఇంకేం ఉంటుంది?
 
ఇందులో మార్షల్ ఆర్ట్స్ కాకుండా ఓ వింత ప్రేమ కథ ఉంటుంది. ఈ అమ్మాయికి బ్రూస్‌లీ అంటే మహా ఇష్టం. ఆ అమ్మాయి అంటే ఇతనికి పిచ్చి. బ్రూస్‌లీ మీదున్న పిచ్చితో ఈ అమ్మాయికి డేంజర్ సిట్యువేషన్ అని తెలిసి.. ఆ బ్రూస్‌లీ మాయలోంచి బయటకు తీసుకొస్తాడు. రంగీలా టైపులా అనుకోవచ్చు. జాకీ ష్రాఫ్ బ్రూస్ లీ అయితే.. ఆమీర్, ఊర్మిళా మిగతా ఇద్దరూఅనుకోవచ్చు.
 
ఈ సినిమాలో మీరు ఎలాంటి కెమెరాలను ఉపయోగించారు?
సాధారణ కెమెరాలను వాడలేదు.కొన్ని షాట్స కోసం ఎక్స్‌ట్రీమ్ హై స్పీడ్ కెమెరాలను వాడాం. దాదాపు థౌజండ్ ఫ్రేమ్స్ పర్ సెకన్ కెమెరాను వాడాం. 
 
ఈ సినిమాను నలభై వేల స్క్రీన్‌లో విడుదల చేయడానికి కారణం ఏంటి?
ఎంటర్ ది డ్రాగన్ సినిమాను దాదాపు 27 సార్లు చూసి ఉంటాను. టికెట్ కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కావు.సైకిల్ మీద వెళ్లేవాడిని. అప్పటి నుంచే నా మీద బ్రూస్‌లీ ప్రభావం ఎక్కువగా పడిపోయింది. శివ సినిమాను రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నుంచి కాపీ కొట్టాను. అందులో రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టి శివ తీశాను. సేమ్ స్క్రీన్ ప్లే. శివ సినిమా  స్క్రిప్ట్ ఇరవై నిమిషాల్లో రాశాను అని చెప్పాను. శివ కూడా మార్షల్ ఆర్ట్స్ సినిమానే. పూర్తి మార్షల్ ఆర్ట్స్ సినిమాను తీయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. అయితే దాని కోసం ఎంతో మంది ట్రైనర్లను వెతికాను. బ్రూస్‌లీలా ఎవ్వరూ అనిపించలేదు. ఇక అలాంటి వారు దొరకరు అని వదిలేశాను. పుణెలో పూజా భలెకర్ అని ఓ అమ్మాయి ఉంది.. అని తెలిసింది. తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్‌లో మెడల్స్ సాధించిందని తెలిసింది. ఆమె తన తండ్రితో వచ్చి ఆడిషన్స్ ఇచ్చింది.అప్పుడు ఈ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ రషెస్ చైనాలోని డిస్ట్రిబ్యూటర్ చూసి ఈ సినిమాను ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. నలభై వేల స్క్రీన్స్ అని కాదు..ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది.
 
ఈ అమ్మాయి ఫైటర్.. యాక్టర్‌గా మలచడానికి మీరేం చేశారు?
యాక్టింగ్‌కు రెండు అవసరం. ఒకటి కెమెరా కాన్షియస్‌నెస్. కెమెరా ముందు ఎలా ఉండాలో తెలియాలి. రెండోది మీరు లోపల ఏం అనుకుంటున్నారో అది మొహం మీద చూపించాలి. ఆడిషన్స్ ఇచ్చిన సమయంలో ఆమె మొహంలో ఇంటెన్సిటీ చూశాను. అది బ్రూస్‌లీలో చూశాను. కెమెరా కాన్షియస్‌నెస్ గురించి చెప్పాను. అందుకే ముందు యాక్షన్ సీక్వెన్స్ చేశాను.  తరువాత డైలాగ్స్ సీన్స్ చేయించాను. ఐదారు రోజుల తరువాత కెమెరా అలవాటు అయిపోతుంది. లోపలి ఫీలింగ్స్‌ను మొహం మీద చూపించనప్పుడే.. బ్యాడ్ యాక్టర్ అవుతారు.
 
మీరు నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఎంత వరకు ఉపయోగపడింది?
నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోలేదు.. నేర్చుకున్నట్టు నటించాను (నవ్వులు). మార్షల్ ఆర్ట్స్ ఎంతో కష్టమైంది. ఓ రెండు కిక్కులు నేర్చుకుని, మనం ఎవ్వరినీ కొట్టకుండా.. బాక్సింగ్ బ్యాగ్‌ను కిక్‌లు కొట్టడం వరకు ఓకే. వచ్చినదాని కంటే నేను ఎక్కువగా షో చేశాను.
 
చైనాలో ఎంత శాతం షూటింగ్ చేశారు?* 
పర్సంటేజీ అని చెప్పలేను గానీ.. చైనాలో 20 రోజులు షూటింగ్ చేశాం.
 
ఈ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్ ఎవరు? 
డిజైనింగ్ సీక్వెన్స్ వేరు.. ఎగ్జిక్యూషన్ వేరు.. సేఫ్టీ మెజర్స్ చూసే టెక్నికల్ టీం వేరు. డిజైనింగ్ చేసింది పూజానే. హైద్రాబాద్,చైనా టీం వాటిని ఎగ్జిక్యూట్ చేసింది.
 
సినిమా చిత్రీకరణ సమయంలో ఎదురైనా సవాళ్లు ఏంటి?* 
పూజా భలేకర్ యాక్టర్ కాదు. యాక్షన్ సీక్వెన్స్‌లో తనకు ఏమైనా అవుతుందేమో అని భయపడ్డాను. యాక్షన్ సీక్వెన్సుల్లో తనకు ఏమైనా అవుతుందా? సినిమా ఆగిపోతుందా? అని అనుకునేవాడిని. కానీ డైరెక్టర్‌గా నాకు ఆ షాట్ కావాలనిపించేది. అప్పుడు మనం ఆమెను పుష్ చేస్తుంటాం. చాలా డేంజరస్ సీక్వెన్స్ చేసింది. గాల్లో సిక్స్ ఫీట్స్ ఎగిరి కొడుతుంది.
 
ఇలాంటి కథను మీరు టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్‌లతో చేస్తే ఇంకా భారీ చిత్రమయ్యేది కదా?* 
టైగర్ ష్రాఫ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నవాడు కాదు. పంచింగ్ బ్యా‌గ్‌ను మాత్రమే కొట్టగలరు. మిగతాది అంతా కూడా వీఎఫ్‌ఎక్స్‌లో చేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం రియల్ టైంలో చేస్తుంది. ఆమెకు మార్షల్ ఆర్ట్స్ వచ్చు. వీఎఫెఎక్స్, గ్రాఫిక్స్ వంటివాటిని నేను తీయలేను. ఇప్పుడు మీరు సినిమాను చూస్తే రియల్ టైంలో జరిగినట్టు అనిపిస్తుంది.
 
- ఈ సినిమాకు అమ్మాయి అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి?* 
ఓ అమ్మాయి ఆరడుగుల అబ్బాయిని కొట్టి పడేస్తే.. అమ్మాయా?అని అందరూ ఆశ్చర్యపోతారు. ఏదైతే చేయలేమని అంతా అనుకుంటారో.. ఓ అమ్మాయి అలా చేసిందంటే కాంట్రాస్ట్‌గా ఉంటుందని పెట్టాను. అమ్మాయి అంటే మగాడి మీద ఆధారపడుతూ, సిగ్గు పడుతుంటుందని అంతా అనుకుంటారు. కానీ ఇలాంటి బట్టలు వేసుకుని అబ్బాయిలను కొడుతుంది..అని చెప్పడానికి అమ్మాయి అని టైటిల్ పెట్టాను.
 
ఈ సినిమాలో మీ తరహా గ్లామర్ ఉందా?* 
అది కచ్చితంగా ఉంటుంది. ఎంటర్ ది డ్రాగన్‌లో బ్రూస్‌లీని చూసినప్పుడు మగాడ్ని అయిన నాకే పిచ్చెక్కింది. అబ్బాయి బాడీ కంటే అమ్మాయి బాడీనే బాగుంటుంది. ఈ సత్యాన్ని అందరూ ఒప్పుకుంటారు. మహారాష్ట్రియన్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిణ్ కుటుంబం నుంచి పూజా వచ్చింది. ఆమెను ఇలాంటి డ్రెస్సులు వేసుకునేందుకు ఎంతో ఒప్పించాల్సి వచ్చింది. ఇంత అందమైన శరీరాన్ని నీకు ఆ దేవుడు ఇచ్చినప్పుడు అందరికీ చూపించకపోవడం అది దేవుడి పట్ల నువ్ చేసే పాపం అని చెప్పాను. 
 
మీ తదుపరి చిత్రాలు ఏంటి?* 
అల్కైదా ఉగ్రవాది మహ్మద్ అట్ట జీవిత చరిత్ర మీద సినిమాను తెరకెక్కిస్తున్నాను. మిడిల్ ఈస్ట్ ఆర్టిస్ట్‌లతో ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో సినిమాను తీస్తున్నాను. నేను ఎప్పుడైనా పాన్ వరల్డ్ అని చెప్పానా? ఇప్పుడు రెండు మూడు సినిమాలు హిట్ అయితే చాలు పాన్ ఇండియా అంటున్నారు.. సౌత్, నార్త్ అని ఉండదు. మనమంతా కలిసి ఏడాదికి వేయి సినిమాలు తీస్తాం.కానీ ఆడినవి మాత్రం నాలుగు. ఇక్కడ పెద్ద పెద్ద సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments