వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను తాజా సినిమా కొండ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రన్నింగ్ బస్‌లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేసింది యాంకర్ స్రవంతి చొక్కారపు. బిగ్ బాస్ నాన్ స్టాప్ కాంటెస్టెంట్ స్రవంతి చొక్కారపు ఈ ఇంటర్వ్యూలో కాస్త డబుల్ మీనింగ్ డైలాగులతో వర్మకే కౌంటరిచ్చింది.
వర్మ దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నారు? అని వర్మకు ఇష్టం లేని ప్రశ్న వేసింది స్రవంతి. దీంతో అది వర్మకి బూతులా అనిపించి నేను అస్సలు బాలేదు.. నాకు చాలా అవసరాలు ఉన్నాయి.. అవి మీరు తీరుస్తారా? తీర్చలేనప్పుడు ఎలా ఉన్నారని ఎలా అడుగుతారు? అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వేశాడు వర్మ.
అయితే వర్మ డబుల్ మీనింగ్‌ని బాగానే అర్ధం చేసుకున్న స్రవంతి.. డైరెక్ట్ మీనింగ్‌లోకి వెళ్లిపోయింది. సార్ బస్‌లో తీర్చేది.. నా వల్ల అయ్యేది.. ఏమైనా చిన్నది ఉంటే తీరుస్తా అని అన్నది. ఆ మాటతో వర్మ.. మీ వల్ల అయ్యేది చిన్నది అంటే ఎలా.. మీ వల్ల అయ్యేది పెద్దదే ఉంటుంది.. అంటూ తన నోటి దూల చూపించాడు.
అయితే స్రవంతి మాత్రం.. సార్ అంటూ తెగ సిగ్గుపడిపోయింది. పక్కన నున్న కొండా సినిమా హీరో గారు అదిత్ అరుణ్ ఈ డబుల్ మీనింగ్ డిస్కషన్ విని తెగ నవ్వేసుకోవడంతో..ఎందుకు నవ్వుతున్నావ్.. మాలో ఏమైనా వేరే అర్ధాలు వినిపిస్తున్నాయా? అంటూ వర్మ మళ్లీ కెలికాడు.
చూసేవాళ్లకి అర్ధం అయ్యి ఉంటుందిలే సార్.. నాకు అర్ధం కాలేదు అని ఆ హీరో అనడంతో.. నీకేమైనా అర్థమైందా? అని తిరిగి స్రవంతిని అడిగాడు వర్మ. ఆ మాటతో స్రవంతి.. చిన్న పిల్లని సార్.. నాకేం తెలియదు అని తెగ నవ్వేసింది.