Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 3 March 2025
webdunia

అమెరికాలో టీ బండి పెట్టుకుంటే డబ్బులు భలే సంపాదించవచ్చు? (వీడియో)

Advertiesment
Anchor Suma
, శుక్రవారం, 10 జూన్ 2022 (16:33 IST)
యాంకర్ సుమ ప్రస్తుతం న్యూయార్క్ టూరులో వుంది. అమెరికాలో తెలుగు సంఘాల వారు నిర్వహించిన కార్యక్రమానికి ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
 
యాంకర్ సుమతో పాటు రవి కూడా తన ఫ్యామిలీతో అమెరికా వీధులలో చక్కర్లు కొడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. సుమ సైతం అమెరికా రోడ్లపై డాన్సులు చేస్తూ ఎప్పటికప్పుడు తన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
 
తాజాగా సుమ ఓ వీడియో ద్వారా అమెరికాలో తాను పడుతున్న ఇబ్బంది గురించి తెలియజేశారు. మన ఇండియాలో ఎక్కువగా చాయ్ లవర్స్ ఉంటారు. అయితే చాయ్ అంటే ఎంతో ఇష్టమున్న సుమకు అమెరికాలో ఎంత వెతికినా ఒక్క చాయ్ దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు ఈ వీడియో ద్వారా తెలియజేశారు.
 
ఒక మంచి చాయ్ తాగడానికి అమెరికాలో వెతకాల్సి వస్తుందని ఎంత వెతికినా తనకు ఒక చాయ్ కూడా దొరకలేదని చెబుతూ చివరికి ఓ రెస్టారెంట్‌కు వెళ్లి.. ఎలాగోలా సంపాదించినట్టుంది.. ఈ రీల్ వీడియోలో సుమ తనకు చాయ్ దొరకలేదని చెబుతున్న కామెడీ మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది. 
 
ఇక అమెరికాలో కాఫీ, టీ బండి పెట్టుకుంటే డబ్బులు బాగా సంపాదించవచ్చు అని ఈ సందర్భంగా సుమ అమెరికాలో తన పడుతున్న కష్టాల గురించి ఈ సందర్భంగా తెలియజేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడిల NBK108 అధికారిక ప్రకటన