Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం వంశీ పైడిపల్లి, మహేష్ బాబు అలా చెప్పాడట?

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (23:04 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మహర్షి సినిమాని తెరకెక్కించడం. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ వద్ద సక్సస్ సాధించడం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన విజయంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్లో ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. దీంతో మహేష్ గీత గోవిందం దర్శకుడు పరశురామ్‌తో సినిమా చేయాలనుకోవడం.. పరశురామ్ చెప్పిన కథ మహేష్‌ కి బాగా నచ్చడంతో ఓకే చేయడం తెలిసిందే. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్త నిర్మించనుంది.
 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క జరుగుతోంది. మే 31న ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వంశీ పైడిపల్లి మరో కథను రెడీ చేసి మహేష్‌ బాబుకి రీసెంట్‌గా వినిపించాడని తెలిసింది. ఈ కథను కూడా మహేష్ మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసాడని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. మహర్షి సినిమా తర్వాత నుంచి వంశీ పైడిపల్లి మహేష్‌తో సినిమా చేసేందుకు చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈసారి మహేష్ బాబుని చాలా కొత్తగా చూపించాలి. మరో హిట్ ఇవ్వాలని కథను రెడీ చేసాడు కానీ.. కథ పూర్తి స్ధాయిలో మహేష్ నచ్చలేదు.
 
అందుకే మహేష్ నో చెప్పాడట. వంశీ పైడిపల్లి ఇప్పుడు ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. చాలా మంది స్టార్ హీరోలు బిజీగా ఉన్నారు. ఒకటి రెండు సినిమాలకు ఓకే చెప్పి ఉండటంతో వంశీ పైడిపల్లి సినిమా చేయడానికి కథ సెట్ కావాలి. ఆ కథకు తగ్గ హీరో ఓకే చెప్పాలి. ఈ లెక్క వంశీ పైడిపల్లి సినిమా చేయడానికి కాస్త ఎక్కువ టైమే పట్టేలా ఉంది. పాపం.. వంశీ పైడిపల్లి ఎప్పుడు ప్రాజెక్ట్ సెట్ అవుతుందో? ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments