Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

దేవీ
బుధవారం, 4 జూన్ 2025 (09:45 IST)
Mad ness poster
బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ క్రియేటివ్స్, 'హాయ్ నాన్న' చిత్రాన్ని అందించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఒక ఆసక్తికర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి కట్టిపడేసే ప్రీ-లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి, ట్రేడ్ తో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన భాను ప్రతాప గతంలో తండేల్ కి పని చేశారు.
 
తాజాగా ఆవిష్కరించబడిన ఆసక్తికరమైన ప్రీ-లుక్ పోస్టర్.. ఉత్సుకతను రేకెత్తించడంతో పాటు, నవ్వులను చిందించేలా ఉంది. ఎరుపు రంగు టోపీలు, నీలిరంగు ముసుగులు ధరించి వరుసగా నిల్చొని ఉన్న కొందరు వ్యక్తులతో కూడిన ఈ పోస్టర్.. ఫన్, మిస్టరీ, మ్యాడ్ నెస్ తో రోలర్‌కోస్టర్‌ను సూచిస్తుంది. జూన్ 6న ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో ప్రకటించిన నిర్మాతలు.. సరికొత్త వినోదాత్మక చిత్రాన్ని అందించనున్నట్లు హామీ ఇచ్చారు.
 
ఈ చిత్రంతో విజయేంద్ర ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకి సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు వ్యవహరిస్తున్నారు.
 
ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన కథన శైలితో వినోదం యొక్క సరికొత్త రుచిని అందించడానికి సిద్ధమవుతోంది. ఆసక్తికరంగా రూపొందించిన ప్రీ-లుక్ పోస్టర్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత ఈ చిత్రంపై అంచనాలు మరో స్థాయికి వెళ్ళడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి ఫుడ్ ఫాయిజన్ : ఓ రోగి మృతి - మరో 70 మందికి...

మేనల్లుడిని చంపి బాడీని ముక్కలు చేసిన మేనత్త... శరీర భాగాలను సిమెంట్‌తో పాతిపెట్టిన తండ్రి..

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments