సినిమా హీరోలు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తో పలు యాడ్స్ లు చేస్తూవుండడం మామూలే. గతంలో సాయి సూర్య డెవలపర్స్, సురారా ప్రాజెక్ట్ లపై మహేష్ ప్రచారకర్తగా వున్నారు. గత ఏడాది సాయిసూర్య వాళ్ళు మోసం చేశారని కొంతమంది ఫిర్యాదు చేశారు. ఇదంతా మహేష్ బాబు ప్రచారం వల్లే జరిగిందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఎట్టకేలకు నేడు మహేష్ బాబుపై ఆ ఎఫెక్ట్ పడింది.
వివరాల్లోకి వెళితే... మహేష్ బాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు తమ కార్యాలయానికి రావాలని కోరింది. దానికి కారణం సాయి సూర్య డెవలపర్స్, సురారా ప్రాజెక్ట్ లపై ఈడీ కేసుల్లో భాగంగా విచారణ చేపట్టంది. అందులో మహేష్ బాబుకు వారు దాదాపు 6కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అందులో కొంత ఆన్ లైన్ చేయగా, కొంత కేష్ ఇచ్చారట. దానిపైన క్లారిటీ రావాలని ఈడీ కోరినట్లు తెలుస్తోంది.
కాగా, దీనిపై తెలుగు ఫిలింఛాంబర్ లో ప్రముఖ నిర్మాత మాట్లాడుతూ, ఈడీ నోటీసులు అనేవి కామన్. దానిపై క్లారిటీ ఇస్తే సరిపోతుంది. అసలు ప్రైవేట్ వ్యక్తల బిజినెస్ వ్యవహారాల్లో ఆచితూచి సెలబ్రిటీలు వ్యవహరించాలని తెలియజేస్తున్నారు. దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ, ఇంకా దీనిపై తనకు పూర్లి క్లారిటీ లేదని సమాధానమిచ్చారు. ఇదిలా వుండగా, ప్రస్తుతం విదేశాలనుంచి వచ్చిన మహేష్ బాబు రాజమౌళి సినిమాను చేయడానికి సన్నద్ధం అవుతున్నారు.