Dhanush: ధనుష్, నిత్యా మీనన్ ల ఇడ్లీ కొట్టు లో ఏం జరిగింది..

దేవీ
సోమవారం, 15 సెప్టెంబరు 2025 (08:21 IST)
Idli Kottu - Dhanush
కుబేర చిత్రం తర్వాత నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్‌, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హోటల్ వెయిటర్ గా వున్న ఫొటోను విడుదల చేశారు. సాఫ్ట్ గా వుండి ఇడ్లీకొట్టు లో పనిచేసే ధనుష్ జీవితంలో ఏం జరిగింది.. అనే అంశంతో చిత్రం రూపొందింది.
 
డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తెలుగు, తమిళ్ లో ఒకేసారి అక్టోబర్ 1న రిలీజ్ కానుంది.
 
చాలామంది ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పోటీ పడ్డారు. ఫైనల్ గా ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రైస్ కి శ్రీ వేదక్షర మూవీస్ తెలుగు రైట్స్ ని దక్కించుకుంది. శ్రీ వేదక్షర మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత రామారావు చింతపల్లి  తెలుగులో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
 
నిర్మాత రామారావు చింతపల్లి మాట్లాడుతూ...ఈ సినిమాని అక్టోబర్ 1న ధనుష్ గారి కెరీర్ లోనే హైయెస్ట్ థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తెలుగులో చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేసి సినిమాని భారీగా రిలీజ్ చేయబోతున్నాము. ఈ సినిమా తెలుగు రైట్స్ మాకు ఇచ్చినందుకు ధనుష్ గారికి, టీం కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.  
 
నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. టాప్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. కిరణ్ కౌశిక్ డీవోపీ గా పని చేస్తుండగా, ప్రసన్న జీకే ఎడిటర్, జాకీ ప్రొడక్షన్ డిజైనర్. పీటర్ హెయిన్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments