Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిలోకసుందరి జీవితంలోని మరపురాని ఘట్టాలు...

భారతీయ వెండితెరపై అతిలోకసుందరిగా ఖ్యాతిగడించిన శ్రీదేవి జీవితంలో అనేక మరుపురాని సంఘటనలు ఉన్నాయి. ఆమె శనివారం రాత్రి కన్నుమూసిన విషయం తెల్సిందే. దీంతో ఆమె జీవితంలోని మరుపురాని ఘట్టాలను ఓసారి పరిశీలిస్త

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (10:43 IST)
భారతీయ వెండితెరపై అతిలోకసుందరిగా ఖ్యాతిగడించిన శ్రీదేవి జీవితంలో అనేక మరుపురాని సంఘటనలు ఉన్నాయి. ఆమె శనివారం రాత్రి కన్నుమూసిన విషయం తెల్సిందే. దీంతో ఆమె జీవితంలోని మరుపురాని ఘట్టాలను ఓసారి పరిశీలిస్తే, 
 
శ్రీదేవి 1963, ఆగస్టు 13వ తేదీన తమిళనాడులోని మీనాంపుట్టిలో జన్మించింది. ఈమె తండ్రి ఓ న్యాయవాది. ఆ తర్వాత నాలుగేళ్లప్రాయంలోనే తమిళ సినిమాలో నటించింది. శ్రీదేవికి ఒక సోదరి, ఇద్దరు సవతి సోదరులు ఉన్నారు.
 
1976 వరకూ శ్రీదేవి బాలనటిగా పలు చిత్రాల్లో నటించింది. 1976లో ఆమె తమిళ సినిమా 'మందరూ ముదిచి' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. 1971 నాటికే శ్రీదేవి పలు అవార్డులు అందుకుంది. మలయాళం సినిమా 'మూవీ పూమ్ బత్తీ'లో నటనకుగాను కేరళ రాష్ట్రస్థాయి అవార్డు అందుకుంది.
 
1979లో హిందీ చిత్రరంగంలో ఆమె కాలు మోపింది. "హిమ్మత్‌వాలా"లో తిరుగులేని విజయ పరంపర కొనసాగించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా గుర్తింపు పొందింది. 
 
1996లో శ్రీదేవి... నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకోగా, వారికి ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, ఖుషి. శ్రీదేవి తన సుదీర్ఘ సినీ జీవితంలో శ్రీదేవి మొత్తం 200 సినిమాల్లో నటించింది. హిందీలో 63, తెలుగులో 62, తమిళంలో 58, మలయాళంలో 21 సినిమాల్లో నటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments