Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాశపరిచిన మూడు చిత్రాలు.. కలెక్షన్లు అంతంత మాత్రమే...

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (14:19 IST)
సినిమా పరిశ్రమకు ప్రతి శుక్రవారం ఓ పండగే. ఎందుకంటే.. కొత్త సినిమాలు విడుదలయ్యేది ఆ రోజు కాబట్టి. ప్రతి కొత్త సినిమా విడుదల సినీ పరిశ్రమలోనివారికి ఓ పండగగానే భావిస్తారు. అయితే, గత శుక్రవారం మూడు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ మూడు చిత్రాలు పాజిటివ్ టాక్‌ను రాబట్టుకోలేకపోయాయి. 
 
ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మోసగాళ్లు. మంచు విష్ణు స్వయంగా నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కాగా, డిజాస్టర్ టాక్‌తోనే ఓపెన్ అయింది. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా తొలిరోజు దారుణంగా నిరాశ పరిచింది. కేవలం 42 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఓ కీలక పాత్రను పోషించారు. 
 
ఇకపోతే, మంచి అంచనాలతో వచ్చిన "చావు కబురు చల్లగా" సినిమా కూడా దారుణంగా నిరాశ పరిచేలా కనిపిస్తుంది. గీతా ఆర్ట్స్ -2 నుంచి వచ్చిన ఈ చిత్రానికి తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో విషయం తక్కువ.. వేదాంతం ఎక్కువైపోయిందంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. కార్తికేయ బాగానే చేసినా కూడా కథనం వీక్ కావడంతో 'చావు కబురు చల్లగా' కాస్త.. చావు కబురు వెచ్చగా అయిపోయేలా కనిపిస్తోంది. 
 
శుక్రవారం విడుదలైన మూడో చిత్రం శశి. ఆది సాయికుమార్ నటించిన ఈ చిత్రం గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. చాలా ఏళ్లుగా వరస ఫ్లాపుల్లో ఉన్న ఆదికి శశి కూడా నిరాశ పరిచేలా కనిపిస్తుంది. 'అర్జున్ రెడ్డి' తరహా రేంజ్‌లో కథ అనుకున్నా స్క్రీన్ ప్లే లోపాలతో రిజల్ట్ దారుణంగా వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments